English   

తేజ హీరోయిన్ తో నాని ఫ్రెండ్ పెళ్లి.. 

Singer-Noel
2019-01-04 09:54:20

తేజ హీరోయిన్ ఎవ‌రు.. నాని స్నేహితుడు ఎవ‌రు అనుకుంటున్నారా..? సినిమా ఇండస్ట్రీలో ప్రేమ వివాహాలు ఇప్పుడేం కొత్త కాదు. ఎప్పటి నుంచో నడుస్తున్న ఆనవాయితీ ఇది. ఇక ఇప్పుడు ఇదే దారిలో మరో జంట కూడా ఒకటి కాబోతుంది. తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నోయల్.. ఓ హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్నాడు. రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాడు నోయ‌ల్. కీర‌వాణి సినిమాల‌కు ర్యాప్ చేస్తుంటాడు ఈయ‌న‌. సింగర్ గా.. ర్యాపర్ గా.. నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు నోయల్. ఈగ, కుమారి 21ఎఫ్, రంగస్థలం లాంటి సినిమాల్లో నటించాడు నోయల్. ఇప్పుడు ఈయన హీరోయిన్ ఎస్తర్ తో ఏడడుగులు నడవబోతున్నాడు.
 
ఇద్దరి పెళ్లి త్వరలోనే జరగబోతుంది. 1000 అబద్దాలు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది ఏస్త‌ర్. ఆ తర్వాత సునీల్ హీరోగా నటించిన భీమవరం బుల్లోడులోనూ ఈమె న‌టించింది. కానీ రెండు సినిమాలు ఫ్లాప్ కావ‌డం ఏస్త‌ర్ కెరీర్ కు బ్రేక్ గా మారింది. జయ జానకి నాయక సినిమాలో సహాయ పాత్రలో నటించింది ఎస్తర్. ఊహించిన అవకాశాలు రాకపోవడంతో ప్రస్తుతానికి చిన్నా చితకా పాత్రలతోనే సరిపెట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇలాంటి సమయంలో ఏడడుగులు నడవడానికి సిద్ధమైపోయింది ఎస్తర్. త్వరలోనే నోయ‌ల్ తో మూడు ముళ్లు వేయించుకోబోతుంది ఈ భామ‌. 

More Related Stories