English   

అర్జున్ రెడ్డి  దర్శకుడితో ఎన్టీఆర్

Arjun-Reddy
2019-01-04 17:38:32

సుమారు ఏడాదిన్నర క్రితం రిలీజ్ అయిన అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు విజయ్ దేవరకొండ. విజయ్ కి ఈ సినిమా ఎంత క్రేజ్ తెచ్చిపెట్టిందో అంతే క్రేజ్ ఆ చిత్ర దర్శకుడు సందీప్ కి కూడా తెచ్చిపెట్టింది. ఎంతలా అంటే ఆ సినిమా బాలీవుడ్ రీమేక్ కి కూడా అతన్నే దర్శకుడిగా తీసుకునే అంత. అయితే ఆ చిత్రం షూటింగ్ కూడా ముగింపు దశకు చేరుకోవడంతో తన నెక్స్ట్ సినిమా మీద దృష్టి పెట్టాడు ఆ దర్శకుడు. ఈ మధ్యకాలంలో సినీ ప్రముఖులు అందరికీ తన ఇంట్లో రాంచరణ్ మంచి పార్టీ ఇచ్చాడట. ఆ పార్టీకి ఎన్టీఆర్, మహేష్, బన్నీ, రానా వంటి వాళ్లు హాజరవగా అదే పార్టీకి హాజరైన సందీప్ ఎన్టీఆర్ కు ఒక స్టోరీ లైన్ చెప్పి మెస్మరైజ్ చేశాడట. సందీప్ చెప్పిన లైన్ నచ్చడంతో ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడట. అయితే ప్రస్తుతం రాజమౌళితో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా షూట్ లో ఉన్న తారక్ షూటింగ్ అయిపోగానే సెట్స్ మీదకు వెళదామని ఈ లోపు కథ స్క్రీన్ ప్లే రెడీ చేసుకోమని సందీప్ కు చెప్పాడని ఫిలింనగర్ సమాచారం. అయితే ఆ మధ్యలో సందీప్ మహేష్ కు కథ చెప్పాడని వీరిద్దరూ సెట్స్ మీదకు వెళతారని ప్రచారం జరిగింది. మరి మరి ఆ ప్రాజెక్ట్ ఏమైందో తెలియదు గానీ ఎన్టీఆర్ ప్రాజెక్టు మాత్రం పట్టాలెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. తన ఫస్ట్ సబ్జెక్ట్ ఓల్డ్ లవ్ స్టోరీ ఎంచుకున్న సందీప్ రెడ్డి ఎన్టీఆర్ కి ఏ లైన్ చెప్పి మెస్మరైజ్ చేశారో మరి.

More Related Stories