English   

'ఎన్టీఆర్' సెన్సార్ అయిపొయింది !

NTR- Biopic
2019-01-04 18:07:30

విలక్షణ దర్శకడు క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ టైటిల్ రోల్ లో తన తండ్రి నందమూరి తారకరామారావు జీవిత కధ ఆధారంగా ఎన్టీఆర్ బయోపిక్ రూపొందుతోంది. ఆ మహానుభావుడి జీవితాన్ని మొత్తం ఒకే సినిమాలో చూపించలేమన్న భావనతో ఎన్టీఆర్ సినీ ప్రయాణం 'కథానాయకుడు' పేరుతోను .. రాజకీయ ప్రస్థానం 'మహానాయకుడు' పేరుతోను విడుదల చేయనున్నారు. 'కథానాయకుడు' ఈ నెల 9 న విడుదల కావాల్సి ఉండగా నిన్న సెన్సార్ ముందుకు వెళ్ళింది. అయితే నిన్ననే క్లీన్ యూ ఇవ్వడానికి సెన్సార్ సిద్దపడినా ఈ బ‌యోపిక్ లో జీవించి ఉన్న పాత్ర‌ల నుంచి నో అబ్జెక్ష‌న్ స‌ర్టిఫికెట్స్ కావాల‌ని అధికారులు కోరారు. నాన్ అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెస్తేనే ఆ సర్టిఫికేట్ ఇస్తామని చెప్పినట్టు నిన్న సాయంత్రం వార్తలు వచ్చాయి. అయితే మరి నాన్ అబ్జెక్షన్ సర్టిఫికేట్లు తెచ్చారో లేదో కానీ కొద్దిసేపటి క్రితమే 'కథానాయకుడు' సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని, క్లీన్ 'యు' సర్టిఫికేట్ ను సంపాదించిందని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇందులో మరో విశేషం ఏంటంటే ఎలాంటి కట్స్ లేకుండా ఈ సినిమా క్లీన్ 'యు' సర్టిఫికేట్ ను పొందడం. ఎలాంటి సెన్సార్ కత్తిరింపులు లేకుండా క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్ పొందిందని తెలుపుతూ పోస్టర్ రిలీజ్ చేశారు.  దీంతో ఈ మూవీ ఈ నెల 9వ తేదిన ప్రేక్ష‌కుల ముందుకురానుండగా రెండో భాగం ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు ఫిబ్ర‌వ‌రి 7వ తేదిన విడుద‌ల కానుంది. క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీకి కీర‌వాణి సంగీతం స‌మ‌కూర్చాడు.  

More Related Stories