English   

బయోపిక్ టార్గెట్ గా నాగబాబు పరోక్ష వ్యాఖ్యలు !

Naga-Babu
2019-01-04 12:34:25

కొద్ది రోజుల నుండి మెగా బ్రదర్ నాగబాబు బాలకృష్ణ ను ఉద్దేశించి పరోక్షంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. తొలుత నందమూరి బాలకృష్ణ ఎవరో తనకు తెలియదంటూ వివాదాన్ని ప్రారంభించిన నాగబాబు, దాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఆ మధ్య ఒక బాబు పాట పాడుతున్న వీడియో ని షేర్ చేసి సారే జహాసే అచ్చా పాట చిన్నవాడైన బలే పాడాడు కదా అంటూ పరోక్షంగా బాలయ్య బుల్బుల్ పదాన్ని గుర్తు చేసి నందమూరి అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు. అయినా ఎక్కడా వెనక్కి తగ్గని నాగబాబు మరోసారి నిన్న రాత్రి పోస్ట్ చేసిన పిక్ తో కలకలం రేపారు. ఆయన పోస్ట్ చేసిన పిక్ లో కవిత్వం ఉంది. కట్టు కథలు కొన్ని, కల్పనల కొన్ని, చుట్ట నేల, మూటకట్టనేల, నిజం చెప్ప లేని బయోపిక్ లో వద్దయ్యా విశ్వదాభిరామ వినరా మామ అంటూ అంటూ ఒక కవిత రాసి కవిత్వాలు మాకు వచ్చు అంటూ ఉపోద్ఘాతం ఇచ్చారు. మొన్న బ్లడ్, బ్రీడ్ అంటూ కొన్ని దున్నపోతుల ఫోటోలను పోస్ట్ చేసి అమ్మకానికి ఉన్నాయని కామెడీగా పెట్టిన పోస్ట్ మరువక ముందే  ఇప్పుడు నేరుగా బయోపిక్ ని టార్గెట్ దాని మీదే వ్యంగ్యాస్త్రాలు విసరడం గమనార్హం.  నాగబాబు తీరు పట్ల నందమూరి అభిమానులు కోపంతో ఉన్నారు.  ఈ వివాదం ఎంతదూరం వెళ్తుందో మరి ?

More Related Stories