English   

బెల్లంకొండ బాధ‌లు తీరేదెప్పుడు.. తొలి విజ‌యం వ‌చ్చేదెప్పుడు..?

Bellamkonda Sai Srinivas announce his next two films
2019-01-04 12:36:12

టాలీవుడ్ లో వారసులకు కొదవలేదు. హీరోల వారసులు అయితే ఒకటి రెండు సినిమాలతో సెట్ అయిపోతారు. కానీ నిర్మాతల తనయులకు మాత్రం టైమ్ అంతగా కలిసి రాదు. వాళ్లు బాగా కష్టపడితే కానీ సక్సెస్ కావడం చాలా అరుదు. వెంకటేష్, జగపతి బాబు లాంటి ఒకరిద్దరు తప్ప నిర్మాతల కొడుకులు స్టార్లుగా మారింది లేదు. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ చరిత్రను తిరగరాయాలని చూస్తున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. కానీ ఆయనకు ఒక్క కథ కూడా సహకరించడం లేదు. ఇప్పటి వరకు నటించిన ఐదు సినిమాలు పరాజయాలే. తాజాగా ఈయన తన పుట్టినరోజును అభిమానుల సమక్షంలో చేసుకున్నాడు. జనవరి 3న బెల్లంకొండ శ్రీనివాస్ జన్మదినం. వివి వినాయక్, దిల్ రాజు లాంటి ఇండస్ట్రీ పెద్దల సమక్షంలో ఈ కుర్రాడి బర్త్ డే జరిగింది.
ఈ సందర్భంగా మరో రెండు సినిమాలను అనౌన్స్ చేశాడు బెల్లంకొండ శ్రీనివాస్. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తుండగానే.. రమేష్ వర్మ తో మరో సినిమా కమిట్ అయ్యాడు. ఈ సినిమాతో పాటు ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతితో ఓ సినిమా చేయబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. వరుసగా ఫ్లాపులు వస్తున్నా అవకాశాలు కూడా అలాగే వస్తున్నాయి బెల్లంకొండ శ్రీనివాస్ కు. కాకపోతే ఇప్పటివరకు విజయం అనేది తలుపుతట్టలేదు. కచ్చితంగా తేజ సినిమాతోనే ఇది అందుకుంటారని ధీమాగా చెబుతున్నారు బెల్లంకొండ. హిట్టూ ఫ్లాపులతో సంబంధం లేకుండా తనకు అండగా నిలుస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు బెల్లంకొండ వారసుడు. మరి ఈయనకు తొలి విజయాన్ని అందించే ఆ దర్శకుడు ఎక్కడున్నాడు చూడాలి.

More Related Stories