English   

ముద్దుగుమ్మ‌ల మ‌ధ్య ఆసక్తిక‌ర‌మైన పోరు..

Interesting fight between pooja hegde and kiara advani
2019-01-04 19:46:17

ఇండస్ట్రీలో హీరోల మధ్య పోరు ఆసక్తికరంగా ఉంటుంది.. కానీ హీరోయిన్ల మధ్య పోరు కాదు. కానీ ఇప్పుడు మాత్రం ఇద్దరు ముద్దుగుమ్మల మధ్య ఇంట్రెస్టింగ్ వార్ నడుస్తోంది. నువ్వు ఒక సినిమా చేస్తే నేను రెండు సినిమాలు చేస్తా అంటూ వాళ్ళు చూపిస్తున్న దూకుడు ముచ్చటగా అనిపిస్తుంది. తెలుగుతో పాటు హిందీలో కూడా స‌త్తా చూపిస్తున్నారు ఆ ఇద్దరు ముద్దుగుమ్మలు. వాళ్లే పూజా హెగ్డే, కైరా అద్వానీ. ప్రస్తుతం ఇద్దరు హీరోయిన్లకు తెలుగు ఇండస్ట్రీలో గోల్డెన్ టైం నడుస్తుంది. భరత్ అనే నేను సినిమా తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన కైరా అద్వానీ తో ఇప్పుడు మన హీరోలు నటించడానికి పోటీ పడుతున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ సినిమాలో నటిస్తున్న కైరా అద్వానీ త్వరలోనే త్రివిక్రమ్ బన్నీ సినిమాలో కూడా కాలు మోప‌నుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.
దానికితోడు హిందీ అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ క‌బీర్ సింగ్ లో కూడా ఈమె హీరోయిన్. ఇప్పుడు కైరా జోరుకు ధీటుగా పూజా హెగ్డే కూడా రచ్చ చేస్తుంది. ప్రస్తుతం మహేష్ బాబు మహర్షి సినిమాతో పాటు ప్రభాస్ రాధాకృష్ణ కుమార్ సినిమాలో కూడా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రెండు సినిమాలతో పాటు హిందీలో హౌస్ ఫుల్ 4 సినిమాలో హీరోయిన్ పూజనే. ఇటు తెలుగు అటు హిందీ ఇండస్ట్రీలో తమ సత్తా చూపిస్తూ ముందుకు వెళ్తున్నారు పూజా హెగ్డే, కైరా అద్వానీ. వీళ్ళ జోరు ఇలాగే సాగితే హిందీలో ఏమో తెలియదు కానీ తెలుగులో మాత్రం అగ్రపీఠం అందుకోవడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. మరి వీళ్ళ వార్ ఇంకెంత మజాగా ఉండబోతుందో చూడాలి.

More Related Stories