English   

కాజల్ నోరు జారి...క్లారిటీ ఇచ్చేసింది !

Kajal
2019-01-04 20:05:39

ఇటీవలే  బెల్లంకొండ శ్రీనివాస్ సరసన కాజల్ నటించిన ‘కవచం’ చిత్రం విడుదలయిన సంగతి తెలిసిందే. అసలా సినిమా ఒకటి వచ్చిందని కూడా చాలా మందికి తెలీదు, ఇలా వచ్చి అలా వెళ్లి పోయిన ‘కవచం’ తర్వాత ఈ జంట మరో సారి కనువిందు చేయనున్నారు. తేజ దర్శకత్వంలో మరోసారి వీరిద్దరు జతగా నటిస్తున్నారు. ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రం తర్వాత తేజ చాలా గ్యాప్ తీసుకుని చేస్తున మూవీ అవ్వడంతో ఆ సినిమా మీద అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు, లేడీ ఓరియంటెడ్ సినిమా కావడంతో మొదటి నుండి కూడా సీత అనే టైటిల్ ప్రచారం జరుగుతుంది. కాని ఇప్పటి వరకు చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం ఆ విషయమై క్లారిటీ ఇవ్వలేదు. కానీ తాజాగా తిరుపతిలోని ఒక కార్యక్రమానికి వెళ్లిన కాజల్, ఈ సినిమాకి 'సీత' అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టుగా నోరు జారింది. అలాగే ఈ సినిమాను మార్చిలో విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు యోచిస్తున్న విషయం కూడా చెప్పేసింది. టైటిల్, రిలీజ్ గురించిన సమాచారాన్ని కాజల్ చెప్పేయడం, దర్శక నిర్మాతల ప్రమోషన్స్ కి ఇబ్బందిని కలిగించే విషయమేనని చెప్పాలి. సెలబ్రిటీలు మైకులు కనపడితే ఆపుకోలేకపోతే ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయి. 

More Related Stories