English   

‘కథానాయకుడు’ సెన్సార్ రివ్యూ వచ్చేసింది !

NTR-biopic
2019-01-05 03:03:21

నందమూరి అభిమానులే కాక  తెలుగు ప్రేక్షకులు యావత్తూ ఎదురుచూస్తున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్ లో మొదటి భాగం విడుదలకి సిద్దమయ్యింది. తెలుగు ప్రజల ఆరాధ్య దైవం స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఆయన తనయుడు నందమూరి బాలక్రిష్ణ లీడ్ రోల్‌ లో క్రిష్ జగర్లమూడి ఈ చిత్రాన్ని రెండు పార్ట్‌లుగా రూపొందించారు.  తొలి భాగాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల చేస్తున్నారు. వాస్తవానికి ఈ చిత్ర సెన్సార్ కార్యక్రమాలు ఈ నెల 3నే జరగాల్సి ఉండగా చివరి నిమిషంలో వాయిదా పడింది. ఎందుకంటే ఈ చిత్రంలోని పాత్రధారులు చాలా మంది బతికే ఉండటంతో వారందరి దగ్గర నుంచి ఎన్ఓసి తీసుకురావాలని సెన్సార్ అధికారులు చెప్పడంతో కాస్త ఆలస్యమై నిన్న సెన్సార్ కార్యక్రమాలను పూర్తి అయ్యాయి.  సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమాకు క్లీన్ యు సర్టిఫికేట్‌ ను అందించింది సెన్సార్ టీమ్.  

అయితే ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు ఎటువంటి కట్స్ చెప్పకుండా క్లీన్ యూ సర్టిఫికేట్ ఇవ్వడం పట్ల చాలా సంతోషంగా ఉంది చిత్ర యూనిట్. ఎన్టీఆర్‌ పాత్రలో నటించిన బాలకృష్ణ నటనకు జనం నీరాజనం పట్టడం ఖాయమేనని, తెలుగు సినిమా చరిత్రలో ఇదో మరపురాని చిత్రంగా అపురూపమైన ఘట్టంగా నిలిచిపోతుందని సెన్సార్ నుండి అభినందనలు అందుకున్నారట చిత్ర యూనిట్. అచ్చుగుద్దినట్టుగా ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య ఒదిగిపోవడంతో పాటు ప్రతి పాత్రకు తీసుకున్న స్టార్ క్యాస్టింగ్ పర్ఫెక్ట్‌గా సరిపోయారని తెలుస్తోంది. ఈ సినిమా మొత్తాన్ని మంచి దర్శకుడు క్రిష్ ఎమోషనల్ టచ్‌తో తెరకెక్కించారని ఎన్టీఆర్ సినీ జీవితానికి సంబంధించిన జనాలకు తెలియని అంశాలను ఆసక్తికరమైన సన్నివేశాలలో తెర మీద ఆవిష్కరించినట్టు తెలుస్తోంది. కీరవాణి అందించిన నేపధ్యం సంగీతం ఈ సినిమాకి మరింత బలాన్ని ఇచ్చినట్టు సమాచారం. మొత్తానికి సెన్సార్ టీమ్ నుండి పాజిటివ్ టాక్‌ రావడంతో చిత్ర యూనిట్ మంచి ఉత్సాహంగా ఉంది.  

More Related Stories