English   

'మణికర్ణిక’ తెలుగు ట్రైలర్‌ టాక్ 

Manikarnika
2019-01-05 03:24:30

వివాదస్పద నటి గా గుర్తింపు తెచ్చుకున్న కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో ‘ఝాన్సీ రాణి లక్ష్మీ భాయ్’ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'మణికర్ణిక'. ఎన్నో ఇబ్బందులు, మరెన్నో వాయిదాల మధ్య షూటింగ్ పూర్తి చేసకున్న ఈ సినిమా ఈ గణతంత్ర దినోత్సవం సందర్బంగా జనవరి 25న విడుదలకానుంది. ఈ సినిమాకి కథా కథనాలను బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ అందించగా క్రిష్ సగం కంగనా దర్శకత్వం వచించారు. ఇటీవల వదిలిన హిందీ ట్రైలర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ రాగా తాజాగా తెలుగులోనూ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

సాధారణ మణికర్ణిక ఝాన్సీ లక్ష్మీబాయిగా ఎలా మారింది, ఆమె చూపించిన ధైర్య సాహసాలు, స్వాతంత్ర్య పోరాటంలో ఆమె పాత్ర తదితర అంశాలను ట్రైలర్‌లో చాలా బాగా చూపించారు. ‘మనం పోరాడుదాం దాని వల్ల భావితరాలు స్వాతంత్ర్య వేడుకలు జరుపుకుంటాయి’  'ప్రతి భారతీయుడిలోనూ స్వాతంత్ర్య కాంక్షను రగిల్చే కాగడాను అవుతాను నేను'. 'ఝాన్సీ మీకూ కావాలి, నాకూ కావాలి కానీ మీకు రాజ్యాధికారం కోసం కావాలి కనీ నాకు మా ప్రజలకి సేవ చేసుకోవడానికి కావాలి' అనే డైలాగ్స్ అలరిస్తున్నాయి. అలాగే కంగనా యువతిగా, తర్వాత రాణిగా, తర్వాత అమ్మగా ఇలా పలు విభిన్న పార్శ్యాలున్న పాత్ర పోషించింది.  ఈ సినిమాకి తెలుగు డైరెక్టర్ క్రిష్ కొంత వరకు దర్శకత్వం చేయగా, మిగిలిన కొంత కంగనా పూర్తి చేసింది. శంకర్ ఎహ్సాన్ లే సంగీతం అందించారు అందించారు. 

More Related Stories