English   

ఎన్టీఆర్ లో బాలకృష్ణ పాత్ర కనిపించదట !

Balakrishna
2019-01-05 11:05:50

క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న 'ఎన్టీఆర్' బయోపిక్ విడుదలకి సిద్దమవుతోంది. అయితే ఈ నేపధ్యంలో ఇటీవల ఆడియో రిలేజ్ నిర్వహించారు. అప్పుడు మాట్లాడిన అనిల్ రావిపూడి ఒక కొత్త డౌట్ గుర్తు చేశాడు. అదేంటంటే ఎన్టీఆర్ వారసుడు బాలకృష్ణ పాత్రను పోషించేది ఎవరు? అనేది. ఇది అందరికీ కలిగిన డౌటే అయినా ఆయన వేదిక మీద ఈ డౌట్ అడగడంతో అందరికీ మరో సారి గుర్తు వచ్చి ? నిజంగా ఎవరు చేస్తున్నారా ? అనే అనుమానం మొదలయ్యింది. అయితే ఈ పాత్ర ఎవరు పోషించారు అనే విషయం మీద క్లారిటీ ఇచ్చేశాడు చెప్పేశాడు హీరో కల్యాణ్ రామ్. సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇంటర్వ్యూ ఇచ్చిన కల్యాణ్ రామ్, సినిమాలో అసలు బాలకృష్ణ పాత్ర లేదని చెప్పుకొచ్చారు. చైతన్యరధ సారథి , తన తండ్రి హరికృష్ణ పాత్రను పోషించిన కల్యాణ్ రామ్ ఈ సినిమాలో బాలకృష్ణ పాత్ర కనిపించలేదని అభిమానులు ఒక్క క్షణమైనా ఆలోచించరని, కథకు ఏం కావాలో అదే చూపించి, దాన్నే చిత్రీకరించారని చెప్పాడు. ఈ చిత్రంలో తన ఫోటో కనిపించినా చాలని భావించానని, అటువంటిది తన తండ్రి పాత్రే దక్కిందని  ఆ పాత్రను తాను పోషించే అవకాశం లభించడం తమకెంతో గర్వకారణమని చెప్పుకొచ్చాడు. ఆలాగే తన తమ్ముడు తారక్ కు బాలకృష్ణ ఎంతో గౌరవం ఇచ్చారని, సినిమా ఆడియో రిలీజ్ కు ముఖ్య అతిథిగా పిలిపించి, అతని చేతుల మీదుగానే ఆడియోను బయటకు తెచ్చారని అసలు అంతకన్నా ఇంకేం కావాలని ప్రశ్నిస్తున్నాడు. నిజమేగా మరి !

More Related Stories