English   

రజనీతో రాజమౌళి మళ్ళీ మొదలయ్యింది !

Rajamouli
2019-01-05 13:44:02

రాజమౌళి - రజనీకాంత్ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతోందని ఆ మధ్య టాలీవుడ్ లో ఓ వార్త చక్కర్లు కొట్టింది.  కొంతమంది తమిళ నిర్మాతలు రాజమౌళితో రజనీ సినిమా గురించి చర్చించారని టాక్ వినిపించింది. ఆ తర్వాత వార్త నెమ్మదిగా మరుగున పడిపోయింది.  అయితే తాజాగా 2.0 ప్రమోషన్స్ టైంలో ఈ విషయం గురించి స్పందించిన రాజమౌళి ఇప్పటివరకు ఆయనతో సినిమా చేసే అదృష్టం రాలేదని ఒకవేళ భవిష్యత్తులో వస్తే మాత్రం వదులుకోన‌ని చెప్పాడు రాజమౌళి. అలాగే మరోపక్క రజనీకాంత్ ఇక తన పూర్తి సమయాన్ని రాజకీయాలకి కేటాయిస్తారని కొందరు అంటుంటే, రజనీ మాత్రం వరుసగా సినిమాలను ఒప్పుకుంటున్నారు. ఈ సంక్రాంతికి ఆయన 'పేట' సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నారు. ఆ తరువాత సినిమాను ఆయన మురుగదాస్ తో ప్లాన్ చేసుకున్నారు. పేట సినిమా టేకింగ్ నచ్చడం వలన ఆ తరువాత సినిమాను మళ్లీ కార్తీక్ సుబ్బరాజ్ తోనే చేస్తానని రజనీ ఆయనకి మాట ఇచ్చాడట. దీంతో మురుగదాస్, కార్తీక్ సుబ్బరాజ్ సినిమాలు పూర్తయిన తరువాత, రాజమౌళితో రజనీ సినిమా వుండే అవకాశం ఉందనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఎలాగు ప్రస్తుతం ఎన్టీఆర్ - చరణ్ లతో రాజమౌళి ఒక క్రేజీ మల్టీ స్టారర్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా తరువాత ప్రాజెక్టు రజనీకాంత్ తోనే ఉంటుందనే వార్త మళ్ళీ మొదలయ్యింది. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.

More Related Stories