English   

త‌న అన్న‌ ఫ్యామిలీ గాయ్ అట !

Sitara
2019-01-05 14:49:00

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, ఆయన భార్య నమ్రతా శిరోద్కర్ లలు అప్పుడప్పుడు తమ కూతురు సితార ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకి కావలసినంత ఆనందాన్ని అందిస్తుంటారు. నిజానికి సితార కూడా చిన్న‌ప్ప‌టి నుండి చాలా యాక్టివ్. మ‌హేష్ తో పాటు ఆయన మూవీ సెట్స్‌కి వెళ్లి అక్క‌డ చిత్ర బృందంతో సితార చేసే సంద‌డి అంతా ఇంతా కాదు. అప్పుడప్పుడు త‌న తండ్రి సినిమాలోని పాట‌లు పాడ‌డం లేదంటే ఆ సాంగ్స్‌కి స్టెప్పులు వేయడం చేస్తుంటుంది సితార‌. తాజాగా సితార త‌న అన్న‌య్య గురించి చెప్పిన ఓ సంగతిని ఒక వీడియోలో పోస్ట్ చేసాడు మహేష్. ‘మా అన్నయ్య గౌతమ్ ఒక పెద్ద ఫ్యామిలీ గాయ్’ అని ముద్దుముద్దుగా సితార చెబుతున్న ఆ వీడియోను  మహేష్ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియోను మహేష్ అభిమానులు షోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. మ‌హేష్ ఇటీవ‌ల క్రిస్మ‌స్‌, న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్ కోసం త‌న ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెళ్లిన సంగ‌తి తెలిసిందే. ఇక మ‌హేష్ న‌టిస్తున్న మ‌హ‌ర్షి చిత్రం అతి త్వ‌ర‌లో మ‌రో షెడ్యూల్ జ‌రుపుకోనుంది. ఏప్రిల్ 5న విడుద‌ల కానున్న ఈ చిత్రాన్ని వంశీ పైడిప‌ల్లి తెర‌కెక్కిస్తున్నారు.  

More Related Stories