English   

కీరవాణి రిటైర్మెంట్ మీద క్లారిటీ !

Keeravani
2019-01-05 08:50:30

తెలుగు సినీ పరిశ్రమకు మేటి సంగీత దర్శకుల్లో కీరవాణి ఒకరు. ప్రస్తుతం వచ్చిన యువ సంగీత దర్శకులకు సైతం పోటీగా నిలుస్తూ ఇంకా చిత్రాలకు సంగీతాన్ని అందిస్తూనే వస్తున్నాడు. ‘బాహుబలి 2’ సమయంలో తాను రిటైర్మెంట్ తీసుకోబోతున్నట్లుగా ఓసారి రిటైర్‌మెంట్ గురించి సీరియ‌స్‌ గా ట్వీట్ చేశాడు కీర‌వాణి. ఫ‌లానా సంవ‌త్స‌రం నుంచి నేను సినిమాలు మానేస్తున్నా అంటూ చెప్పుకొచ్చాడు. అప్పుడు ఆ సమయంలో కొంతమంది నిర్మాతలపై మరియు దర్శకులపై కీరవాణి సంచలన ఆరోపణలు చేశారు. మ్యూజిక్ టేస్ట్ లేని వారు కొందరు తన ట్యూన్స్ ను వద్దన్నారంటూ ఆరోపణలు చేసి చర్చనీయాంశం అయ్యాడు. దీంతో బాహుబ‌లి బిగినింగ్ త‌ర‌వాత కీర‌వాణి సినిమాల‌కు దూరం అయిపోతాడ‌నుకున్నారు. 

కానీ `బాహుబ‌లి 2` త‌ర‌వాత ఆయన ప్రయాణం కొన‌సాగింది. ప్ర‌స్తుతానికైతే కీర‌వాణి వ‌రుస‌గా సినిమాల్ని ఒప్పుకుంటున్నాడు. తాజాగా ఆయన్ని  రిటైర్మెంట్‌పై అప్ప‌ట్లో ఓ ప్ర‌క‌ట‌న చేశారు క‌దా అని అడిగితే అసలు తను ఎప్పుడూ సినిమాలకు పూర్తిగా రిటైర్మెంట్ అవ్వాలనుకోలేదని నన్ను ఇబ్బంది పెట్టిన పరిస్థితులను తప్పించుకునేలా రిటైర్మెంట్ తీసుకోవాలనుకున్నానని లాజికల్ గా సమాధాన, చెప్పాడు. అదేంట్రా అనుకుంటే నేనొక ట్యూన్ చేస్తే అది నిర్మాత మనవరాలికి నచ్చలేదని చెప్పి తిరష్కరించారు. అలాంటి వారితో వర్క్ చేయడం నుండి రిటైర్మెంట్ తీసుకున్నానని. నేను చేసిన ట్యూన్ ను మరొకరితో సరి చేయించినటువంటి ఫిల్మ్ మేకర్స్ నుండి రిటైర్మెంట్ తీసుకున్నాను అంటూ క్లారిటీ ఇచ్చాడు. అంటే కీరవాణి తనపై పూర్తి నమ్మకం పెట్టి తనకే ట్యూన్స్ బాద్యత అప్పచెప్పే తన తమ్ముడు రాజమౌళి లాంటి వారి సినిమాలు మాత్రమె చేయాలని భావిస్తున్నాడన్నమాట. 

More Related Stories