English   

శ్రీ దేవి కూతురు దేవరకొండని పెళ్లి చేసుకుంటుందట.!!

Jhanvi
2019-01-05 17:50:05

విజయ్ దేవరకొండ క్రేజ్ టాలీవుడ్‌నే కాక, బాలీవుడ్‌ను కూడా తాకిన సంగతి తెలిసిందే. ‘ధడక్’ సినిమాతో కుర్రకారు గుండెలు కొల్లగొట్టిన అందాల నటి శ్రీ దేవి కుమార్తె జాన్వీ కపూర్ సైతం 'కాఫీ విత్ కరణ్' కార్యక్రమంలో విజయ్ దేవరకొండ పేరును ప్రస్తావించడం హాట్ టాపిక్ గా మారింది. తెల్లవారి నిద్రలేచే సరికి మేల్ యాక్టర్ గా మారిపోవలసి వస్తే ఎవరిలా మారిపోవాలనుకుంటారు? అనే ప్రశ్నకి ఆమె విజయ్ దేవరకొండ పేరు చెప్పి అందరినీ షాక్ కి గురి చేశారు. అయితే తాజాగా ఓ వెబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలోను ఆమె మరోసారి విజయ్ దేవరకొండ పేరును ప్రస్తావించింది. 'ఏ హీరోను చూస్తే మీకు క్రష్ కలుగుతుంది? పెళ్లి చేసుకోవాలని అనిపిస్తుంది?' అనే ప్రశ్నకు సమాధానంగా ఆమె తడుముకోకుండా విజయ్ దేవరకొండ పేరునే చెప్పేసింది. 'గీత గోవిందం'లోని 'ఇంకేం ఇంకేం కావాలే ..' అనే సాంగ్ అంటే తనకి ఇష్టమనీ .. చాలాసార్లు విన్నానని చెప్పడం విశేషం. ఇక తాజాగా విజయ్ ఫాన్స్ లిస్టులోకి లస్ట్ స్టోరీస్ భామ కైరా అద్వానీ కూడా చేరిపోయింది. చరణ్ సరసన ఆమె కథానాయికగా చేసిన 'వినయ విధేయ రామ' జనవరి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆమె ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా వుంది. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన కైరా అద్వాని చాలామంది లాగే నేను విజయ్ దేవరకొండకి పెద్ద ఫ్యాన్ నని చెప్పుకొచ్చింది.  ప్రస్తుతం హిందీలో 'కబీర్ సింగ్' సినిమా చేస్తున్నానని ఇది 'అర్జున్ రెడ్డి'కి రీమేక్ కావడంతో ఆ 'కబీర్ సింగ్' సినిమా కోసమే 'అర్జున్ రెడ్డి' చూశానని. అప్పటి నుంచి విజయ్ దేవరకొండకి అభిమానిగా మారిపోయానని చెప్పుకొచ్చింది.   జాన్వీ కపూర్ ...

More Related Stories