English   

వినయవిధేయరామ సెన్సార్ రివ్యూ !

Vinaya-Vidheya-Rama
2019-01-05 18:39:02

మొట్టమొదటి సారిగా చరణ్, బోయపాటి కాంబినేషన్లో రూపొందిన 'వినయ విధేయ రామ' సంక్రాంతికి కానుకగా ఈ జనవరి 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్య క్రమాలను కూడా పూర్తి చేసుకుంది.  సెన్సార్ టీమ్ ఈ చిత్రానికి ఎలాంటి కట్స్ లేకుండా యు/ఎ సర్టిఫికేట్ ఇచ్చింది. కాగా సెన్సార్ వారి వ్యూ ప్రకారం ఈ చిత్రం మొదటి భాగం ఫ్యామిలీ సన్నివేశాలతో సరదాగా ఉంటుందని, అలాగే రెండో భాగంలో యాక్షన్ సీక్వెన్స్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా బాగా ఆకట్టుకుంటాయని, చరణ్ యాక్షన్, కైరా గ్లామర్ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని అంటున్నారు. 

ఇక చరణ్ కు తగ్గ ప్రతినాయకుడిగా వివేక్ ఒబెరాయ్ అద్భుతమైన నటన కనబరచాడని అంటున్నారు. అలాగే ఈ సినిమాలో వచ్చే 'అజర్ బైజాన్' యాక్షన్ ఎపిసోడ్ హైలైట్ అని చేబుతున్నారు. బోయపాటి ఇంతవరకూ చేసిన యాక్షన్ సీన్స్ కి మించి ఈ సీన్ ఉంటుందని అంటున్నారు. అలాగే ఈ సినిమాలో స్నేహ, ప్రశాంత్, ఆర్యన్ రాజేశ్  వంటి వాళ్ళు ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకి ముందు చరణ్ 'రంగస్థలం' సంచలన విజయాన్ని సాధించడంతో, ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. దాదాపు 1200 స్క్రీన్లలో విడుదల అవుతోంది ఈ చిత్రం. అలాగే బిజినెస్ పరంగా కూడా ‘విన‌య విధేయ‌ రామ’ 94 కోట్ల ప్రీరీ రిలీజ్ బిజినెస్ చేసింది. అంతేకాక సినిమా ట్రైలర్ అండ్ పోస్టర్స్ కూడా మంచి బజ్ క్రియేట్ చేశాయి. మరి చూడాలి ఈ సినిమా ఏ రేంజ్ హిట్ అవుతుందో.

More Related Stories