English   

నయనతార ఐరా టీజర్...ఔరా !

Nayanthara's Airaa  trailer released
2019-01-05 11:57:28

నయనతార ఒక సినిమాలో నటిస్తోంది అంటే, ఆ కథలో కొత్తదనం ఉంటుంది లేదా కంటెంట్ ఉన్న సినిమానే ఆమె ఎన్నుకుంటుంది అనే నమ్మకాన్ని ఆమె ప్రేక్షకుల్లో కలిగించింది. ఈ కారణంగానే నయనతార ఖాతాలోకి అన్నీ వైవిధ్యభరితమైన చిత్రాలే చేరుతున్నాయి. తాజాగా ఆ లిస్టులో నయనతార నటిస్తున్న ద్విభాషా (తమిళ, తెలుగు) చిత్రం ‘ఐరా’ చేరింది. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమాని కేఎమ్ సర్జున్ దర్శకత్వం వహించాడు. హారర్ థ్రిల్లర్ జానర్ లో వస్తున్న ఈ సినిమాలో నయనతార ప్రధాన పాత్ర పోషిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి తమిళ టీజర్ ను వదిలారు. నయనతార డిఫరెంట్ లుక్స్ తో కనిపిస్తోన్న ఈ టీజర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. టీజర్లో సీతాకోకచిలుకలు నయనతార చుట్తో తిరగడం ఈ సినిమా మీద ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. గతంలో 'మాయ', 'డోరా' వంటి థ్రిల్లర్స్ తో మెప్పించిన నయనతార, మరోసారి ప్రేక్షకులను భయపెట్టడానికి రెడీ అయ్యింది. ఈ సినిమాలో నయనతార డ్యూయల్‌ రోల్‌ చేశారు. మొత్తానికి ‘ఐరా’ టీజర్‌ ను ఔరా అనిపించేలా చిత్రబృందం కట్‌ చేశారని చెప్పక తప్పదు. ఈ సినిమా ఆమెకు 63 వ సినిమా. ఇదిలా ఉంటే చిరంజీవి హీరోగా రూపొందుతున్న ‘సైరా: నరసింహారెడ్డి’ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. కోలీవుడ్‌లో విజయ్‌ హీరోగా రూపొందనున్న సినిమాలో, కమెడియన్ శివ కార్తీకేయన్‌ హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలో కూడా ఆమే కథానాయిక.

More Related Stories