English   

నాగబాబుతో డాన్స్ చేయించిన బాలయ్య ఫ్యాన్స్...వామ్మో !

nandamuri balakrishna fans protest against nagababu in chennai college event
2019-01-05 12:52:32

కొద్ది నెలల క్రితం పవన్ కళ్యాణ్ ఎవరో తనకు తెలియదంటూ నందమూరి బాలకృష్ణ చేసిన కామెంట్స్‌కి కౌంటర్‌‌ గా మెగా బ్రదర్ నాగబాబు బాలకృష్ణ ఎవరో తెలీదు అంటూ కౌంటర్ ఇచ్చారు. అది అక్కడితో ఆగక మళ్ళీ బాలకృష్ణ ఎవరో తెలియదు అనడం తప్పే ఆయనో పెద్ద కమెడియన్ బాగా కామెడీ చేస్తారు అంటూ మళ్ళీ బాంబు వేసి తాజాగా బ్లడ్ అండ్ బ్రీడ్ అంటూ గేదెలు కుక్కలు పోస్ట్ చేసి, ఆ తర్వాత కవిత్వాలు చెప్పడం మాకూ వచ్చని బయోపిక్కు మీద సంచలన వ్యాఖ్యలు చేసి వివాదాన్ని రాజేశారు. దీంతో మెగా ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తుంది. దీంతో నాగబాబుని ఓ నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో తిట్టిపోస్తుండగా మెగా ఫ్యాన్స్‌కూడా అదే రేంజ్‌లో కౌంటర్లు ఇస్తున్నారు. అయితే తాజాగా ఓ కాలేజ్ ఫంక్షన్ నిమిత్తం చెన్నైకి వెళ్లిన నాగబాబుకి బాలయ్య అభిమానులు నుండి నిరసన సెగ తగిలింది. కాలేజ్ ఫంక్షన్‌కి ముఖ్య అతిథిగా హాజరైన నాగబాబుకి ‘జై బాలయ్య’ నినాదాలతో చుక్కలు చూపించారు నందమూరి ఫ్యాన్స్. నాగబాబు ప్రసంగిస్తున్న సమయంలో ‘బాలయ్య ఎవరో తెలీదా? అంటూ కేకలు పెట్టి జై బాలయ్య నినాదాలతో రచ్చరచ్చ చేశారు. అక్కడితో ఆగితే బాగుండేది కానీ నాగబాబు స్టేజ్ మీద ఉన్న సందర్భంలో బాలయ్య నటించిన లెజెండ్ మూవీ సాంగ్‌ వచ్చేట్టు చేసి నాగబాబుతోనే స్టెప్పులు వేయించడం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే బాలయ్య అభిమానులు అధిక సంఖ్యలో ఆ కార్యక్రమానికి రావడంతో ఏమీ చేయాలని నాగబాబు లెజెండ్ సాంగ్‌ కు నవ్వుతూ డాన్స్ చేయడంతో బాలయ్య అభిమానులు శాంతించారు. ఈ వివాదం ఇంకెంత దూరం పోతుందో ఏమో ?

More Related Stories