English   

బెంగళూర్ సెంట్ర‌ల్ ను టార్గెట్ చేసిన ప్ర‌కాశ్ రాజ్..

Prakash Raj to contest 2019 Lok Sabha elections from Bengaluru Central
2019-01-05 21:19:45

ప్ర‌కాశ్ రాజ్ ఇప్పుడు సినిమాలతో పాటు రాజకీయాల్లోను బిజీగా ఉన్నాడు. కొత్త సంవత్సరం సందర్భంగా తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన ప్రకాష్ రాజ్.. ఇప్పుడు తాను ఎక్కడినుంచి పోటీ చేయనున్నది కూడా కన్ఫర్మ్ చేశాడు. ఏడాది మొదట్లోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నాను.. ఎంపీగా పోటీ చేస్తున్నానని చెప్పాడు ఈ విలక్షణ నటుడు. ఇప్పుడు బెంగుళూరు సెంట్ర‌ల్ నుంచి తాను స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు ప్రకాష్ రాజ్. ఈ విషయంపై తన ట్విట్టర్లో క్లారిటీ ఇచ్చాడు ఈ నటుడు. బిజెపికి వ్యతిరేకంగా ఇప్పటికే చాలా స్పీచులు ఇచ్చాడు ప్రకాష్. ముఖ్యంగా మోడీని విమర్శించడం లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాడు. ఇప్పటి వరకు ప్రతి మీటింగ్ లో మోడీ చేసింది ఏంటి అంటూ ముక్కుసూటిగా వెళుతున్నాడు ప్రకాష్ రాజ్.
ఇప్పుడు ఏకంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంతో రాజకీయ వేడి ఇంకా రాజుకుంది. బెంగళూరు సెంట్రల్ అంటే చిన్న నియోజకవర్గం కాదు.. కానీ ప్రకాష్ రాజు ఈ స్థానం నుంచి పోటీ చేయడం వెనక ఆయన లెక్కలు ఆయనకు ఉన్నాయంటున్నారు సన్నిహితులు. కచ్చితంగా స్వతంత్ర అభ్యర్థిగా ప్రకాష్ రాజ్ విజయం సాధిస్తాడని నమ్ముతున్నారు వాళ్లు. ఈ సమ్మర్ లోనే లోక్ స‌భ‌ ఎన్నికలు జరగబోతున్నాయి. అందుకే ఈయ‌న సినిమాలు కూడా తగ్గించి రాజకీయాలపైన ఎక్కువగా దృష్టి పెట్టారు. మరి ప్రకాష్ రాజ్ ప్రత్యక్ష రాజకీయాల్లో ఎంతవరకు ప్రభావం చూపిస్తాడు అనేది ఆసక్తికరంగా మారిందిప్పుడు.

More Related Stories