English   

రామ్ చ‌ర‌ణ్ తోనే రాం రాం చెబుతున్న రానా..

rana's no 1 yaari season 2 ended with ram charan and kiara advani
2019-01-05 21:31:47

రానా నెంబర్-1 యారి షో మరో సీజన్ 2 ముగింపు ద‌శ‌కు వచ్చేసింది. నిన్నగాక మొన్న మొదలైనట్లు కనిపించి.. అప్పుడే రెండో సీజన్ పూర్తి కావచ్చింది. నమ్మడానికి ఇది ఆశ్చర్యంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఈ విషయాన్ని స్వయంగా తన ట్విట్ట‌ర్ లో అనౌన్స్ చేశాడు రానా. తొలి సీజన్ తో పోలిస్తే రెండో సీజన్ ఇంకా పెద్ద విజయం సాధించింది. రేటింగ్స్ కూడా అద్బుతంగా వ‌చ్చాయి. అప్పుడే 12 ఎపిసోడ్లు పూర్తి చేసుకొని చివరి ఎపిసోడ్ ను కూడా షూట్ చేశాడు రానా. తాజాగా దీనికి సంబంధించిన వివరాలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు దగ్గుబాటి వారసుడు. నెంబర్ వన్ యారి రెండో సీజన్ లాస్ట్ గెస్ట్ గా రామ్ చరణ్ వచ్చాడు.
అతను చేసిన అల్లరి అభిమానులతో పంచుకున్నాడు రానా. జనవరి 6న ఎపిసోడ్ ప్రసారం కానుంది. విన‌య విధేయ రామ ప్రమోషన్లో భాగంగా హీరోయిన్ కైరా అద్వానీతో కలిసి ఈ షోకు వచ్చాడు రామ్ చరణ్. విజయ్ దేవరకొండతో సీజన్ 2 మొదలుపెట్టాడు రానా. రామ్ చరణ్ తో ముగింపు పలుకుతున్నాడు. తన బెస్ట్ యారీస్ తోనే ఫస్ట్ ఎపిసోడ్.. లాస్ట్ ఎపిసోడ్ షూట్ చేశాను అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు రానా. ఈ సీజన్ లో బాలయ్య, రకుల్, మంచు లక్ష్మి, తమన్నా, నిఖిల్, వెంకటేష్, సుమంత్ లాంటి వాళ్ళు వచ్చారు. మొత్తానికి వచ్చే సీజన్లో మళ్ళీ కలుసుకుందాం అంటూ ప్రస్తుతానికి బై బై చెప్పాడు ఈ దగ్గుపాటి వారసుడు. మ‌రి వ‌చ్చే సీజ‌న్ ఇంకెంత ర‌చ్చ చేయ‌బోతున్నాడో ఈ భ‌ళ్ళాల‌దేవుడు.

More Related Stories