English   

పాపం అఖిల్ హార్ట్ మ‌ళ్లీ బ్రేక్ అయిందే..

Akhil Akkineni's Mr Majnu Movie third song
2019-01-05 21:44:01

పాపం అఖిల్ హార్ట్ బ్రేక్ అయిపోయింది. ఇప్పటికే ఒకసారి ప్రేమలో విఫలమైన ఈ కుర్రహీరో.. మరోసారి అదే దారిలో వెళ్తున్నాడు. కాకపోతే ఈసారి సినిమా కోసమే కానీ నిజజీవితంలో కాదు. ఈయ‌న ప్రస్తుతం నటిస్తున్న మిస్టర్ మజ్ను షూటింగ్ పూర్తి అయిపోయింది. ఇప్పటికే రెండు పాటలు విడుదలయ్యాయి కూడా. ఇక ఇప్పుడు మూడో పాట‌కు ముహూర్తం ఖరారు చేశారు దర్శక నిర్మాతలు. జనవరి 6 సాయంత్రం 6 గంటలకు మిస్టర్ మ‌జ్ను మూడో పాట విడుదల కానుంది. హార్ట్ బ్రేక్ అంటూ సాగే ఈ పాట మనసుని హత్తుకునేలా ఉండబోతుందని చెబుతున్నాడు ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి. తమన్ కూడా ఈ పాట కోసం ప్రాణం పెట్టాడు అంటున్నాడు అఖిల్.
ఇప్పటి వరకు విడుదలైన రెండు పాటలు పెద్దగా ప్రభావం చూపించక పోవడంతో మూడో పాట ఎలా ఉండబోతుందో అని అక్కినేని అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. కచ్చితంగా ఈ పాటతో సినిమాపై అంచనాలు పెరుగుతాయ‌ని నమ్ముతున్నారు వాళ్ళు. తొలి టీజ‌ర్ తో పోలిస్తే రెండో టీజర్ సినిమాపై హైప్ పెంచేసింది. కాస్త రొమాన్స్ ఎక్కువైనా గాని యూట్యూబ్లో ట్రెండింగ్ అవుతుంది ఈ టీజర్. అదే నమ్మకంతో ఇప్పుడు మూడో పాట కూడా హిట్ అవుతుందని చెబుతున్నారు దర్శక నిర్మాతలు. జనవరి 25న సినిమా విడుదల కానుంది. మరి చూడాలిక అఖిల్ హార్ట్ బ్రేక్ అయ్యేంత ప‌ని పని నిధి అగర్వాల్ ఏం చేసిందో..?

More Related Stories