English   

రేపు విద్యాబాలన్ తో నిమ్మకూరుకు బాలయ్య !

Balakrishna and vidya balan  visit nimmakuru tomorrow
2019-01-06 09:00:39

తన తండ్రి బయోపిక్ లో తన తల్లి బసవతారకం పాత్రను పోషించిన బాలీవుడ్ నటి విద్యాబాలన్ తో కలిసి, ఎన్టీఆర్‌ స్వగ్రామమైన నిమ్మకూరులో రేపు బాలకృష్ణ పర్యటించనున్నారు. 'ఎన్టీఆర్' రెండో భగం మహానాయకుడుకి సంబంధించిన ఓ సీన్ బాకీ ఉండడంతో చిత్ర యూనిట్ రేపు ఆ సీన్ ని గ్రామంలో చిత్రీకరించనున్నారని చెప్పారు. ఈ షూట్ లో విద్యాబాలన్ తో పాటు బాలకృష్ణ, హరికృష్ణగా నటిస్తున్న కల్యాణ్ రామ్ ఉంటారు. రేపు ప్రత్యేక విమానంలో వీరంతా హైదరాబాద్ నుంచి గన్నవరం చేరుకుని, అక్కడి నుండి రోడ్డు మార్గంలో 10 గంటలకల్లా నిమ్మకూరు చేరుకుంటారు.  మరోపక్క ‘కథానాయకుడు’ నుండి ఇప్పటికే చాలా పాత్రలకు సంబంధించిన పోస్టర్లు విడుదలగా తాజాగా శ్రీవేంకటేశ్వరుడి పాత్రధారణలో బాలకృష్ణ పోస్టర్‌ను విడుదల చేశారు. వెంకన్న వేషధారణలో బాలకృష్ణ నడుస్తూ వస్తుంటే ఆ వేంకటేశ్వరుడే నడుచుకుంటూ వస్తున్నాడా అనే భావన కలుగుతోంది. ఈ పోస్టర్ ద్వారానే అలాగే సినిమా విడుదల ప్రోమోను కూడా విడుదల చేశారు. సంక్రాంతి కానుకగా కథానాయకుడు జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుండగా ‘మహానాయకుడు’ ఫిబ్రవరి 7న విడుదలవుతోంది. 

More Related Stories