English   

ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో అలీ భేటీ.. జ‌న‌సేన‌లో చేర‌బోతున్నాడా..?

comedian ali meets janasena chief pawan kalyan
2019-01-06 09:17:39

ప‌వ‌న్ క‌ళ్యాణ్, అలీ మ‌ధ్య ఉన్న స్నేహం గురించి ఇప్పుడు కొత్త‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. రెండున్న‌ర ద‌శాబ్ధాలుగా ఒక‌రికొక‌రు తెలుసు. ఒక‌రి గురించి మ‌రొకరికి పూర్తిగా తెలుసు కూడా. ఇలాంటి స‌మ‌యంలో మొన్నామ‌ధ్యే జ‌గ‌న్ ను క‌లిసి చాలా సేపు మాట్లాడాడు అలీ. ఆయ‌న జ‌గ‌న్ పార్టీలోకి వెళ్ల‌నున్నాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ స‌మ‌యంలోనే ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను క‌లిసాడు అలీ. దాదాపు ఆయ‌న‌తో 20 నిమిషాల పాటు చ‌ర్చించాడు ఈ కమెడియ‌న్. ఈ భేటీ వెన‌క ఉన్న అంత‌రార్థం ఏంటా అని ఇప్పుడు అభిమానులు ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు.
తాను కూడా జ‌న‌సేన‌లోకి వ‌స్తాన‌ని అడ‌గడానికి వ‌చ్చాడా.. లేదంటే వైసిపిలోకి వెళ్తున్నాను ఆశీర్వ‌దించండి అంటూ చెప్ప‌డానికి వ‌చ్చాడా అనేది ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో జ‌రుగుతున్న చ‌ర్చ‌. భేటీ అనంత‌రం అలీ మీడియాతో మాట్లాడుకుంట‌నే అక్క‌డ్నుంచి వెళ్లిపోయాడు. దాంతో ఇప్పుడు ఈ ఇద్ద‌రి మ‌ధ్య ఎలాంటి భేటీ జ‌రుగుంటుందా అని ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతుంది. మ‌రి దీనిపై అటు అలీ కానీ.. ఇటు ప‌వ‌న్ కానీ నోరు విప్పితే కానీ అస‌లు విష‌యం బ‌య‌టికి రాదు.

 

More Related Stories