English   

సంక్రాంతికి ఆ రెండు సినిమాలు సైలెంట్ కిల్ల‌ర్స్..

f2 and Peta Movies are release in sankratri race
2019-01-06 16:28:37

ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలియదు.. అది కరిచిన తర్వాత కానీ దాని ప్రభావం కనిపించదు.. ఇప్పుడు సంక్రాంతి సినిమాల విషయంలో కూడా ఇదే జరుగుతుంది. నాలుగు సినిమాలు వస్తుంటే అంద‌రి దృష్టి రెండింటిపై మాత్రమే ఉంది. అవే క‌థానాయ‌కుడు, విన‌య విధేయ రామ‌. కానీ మిగతా రెండు సినిమాలు మాత్రం సైలెంట్ గా వస్తున్నాయి. వాటిని ఏ మాత్రం తక్కువగా అంచనా వేసినా కూడా అసలుకే ఎస‌రు త‌ప్ప‌దు. ఆ రెండు సినిమాలు రజనీకాంత్ పేట.. వెంకటేష్, వరుణ్ తేజ్ ఎఫ్2. ఇందులో ముఖ్యంగా వెంకటేష్ సినిమాపై అంచనాలు కాస్త తక్కువగా ఉన్నాయి. కానీ సంక్రాంతికి ఎప్పుడు ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కు ఎక్కువగా డిమాండ్ ఉంటుందనే విష‌యాన్ని మ‌రిచిపోకూడ‌దు. ఈ నమ్మకంతోనే ఇంత భారీ కాంపిటీషన్లో కూడా దిల్ రాజు తన సినిమాను విడుదల చేస్తున్నాడు.
రెండేళ్ల కింద చిరంజీవి, బాలకృష్ణ లాంటి హీరోల మధ్య శర్వానంద్ ని పంపించి శతమానంభవతితో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు ఈ నిర్మాత. ఇప్పుడు కూడా ఇదే మాయ రిపీట్ అవుతుంద‌ని నమ్ముతున్నాడు ఈయ‌న‌. మరో వైపు అనిల్ రావిపూడి దర్శకుడు కావడం కూడా ఎఫ్2 కు  కలిసొస్తుంది. ఇక ఈ సినిమా ఇలా ఉంటే పేట సినిమా అసలు అంచనాలు లేకుండా వస్తుంది. అక్కడ ఉన్నది రజినీకాంత్ అనే విషయం మర్చిపోకూడదు. సినిమాకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కచ్చితంగా సూపర్ స్టార్ తన సత్తా చూపిస్తాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. మొత్తానికి అటు పేట‌.. ఇటు ఎఫ్2 సినిమాలు సైలెంట్ గా వస్తున్నాయి. ఈ రెండు సినిమాల టాక్ ఎలా ఉంటుందో.. వీటి ప్రభావం ఎలా ఉండ‌బోతుందో విడుదలైన తర్వాత కానీ అంచనా వేయలేం.

 

More Related Stories