English   

‘ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’ మీద మరో కేసు !

petition filed in delhi high court seeking ban on trailer of the accidental prime minister
2019-01-06 09:33:51

 ‘ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’ చిత్రం పై రోజుకో వివాదం పుట్టుకొస్తోంది. సినిమాలో వాస్తవాలను వక్రీకరించారంటూ ఆ సినిమా మాకు చూపించాకే విడుదల చేయాలని కాంగ్రెస్ నేతలు ఇప్పటికే ఆందోళన మొదలుపెట్టారు. తాజాగా ఆ సినిమా  మీద నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రతిష్టకు భంగం కలిగేలా వాస్తవాలను వక్రీకరించి చిత్రాన్ని రూపొందించారని పిటిషన్‌ లో పేర్కొన్నారు. ఆ చిత్రంలో మన్మోహన్ సింగ్ పాత్రలో అనుపమ్ ఖేర్ నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా జనవరి 11న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ తర్వాత రాజకీయ దుమారం రేగుతోంది. ఇది మన్మోహన్ సింగ్ ను కించపరిచేందుకు తీసిన బీజేపీ ప్రేరేపిత సినిమా అంటూ కాంగ్రెస్ మండిపడుతోంది. అందుకే ఈ సినిమాలో మన్మోహన్ సింగ్ పాత్రలో నటించిన అనుపమ్ ఖేర్‌తో పాటు చిత్ర దర్శక, నిర్మాతలపై బిహార్ న్యాయస్థానంలో సుధీర్‌ కుమార్‌ ఓజా అనే న్యాయవాది కూడా రెండు రోజుల క్రితం పిటిషన్ వేశారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఇటీవల విడుదల కాగానే వివాదం మొదలైంది. అయితే  మరో పక్క ఈ సినిమా మీద బీజేపీ మిత్రపక్షమైన శివసేన ఎంపీ ఒకరు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన యాక్సిడెంటల్ పీఎం కాదు సక్సెస్ ఫుల్ పీఎం అని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. పదేళ్ల పాటు దేశాన్ని నడిపించిన ప్రధానిగా మన్మోహన్ ను ప్రజలు గౌరవిస్తారని, పీవీ నరసింహారావు తర్వాత దేశానికి దొరికిన విజయవంతమైన ప్రధాని మన్మోహనేనని సంజయ్ ప్రశంసించారు.

More Related Stories