English   

మా బాబాయ్ కు నేనున్నా.. రామ్ చరణ్ సంచలన కామెంట్స్..

ram charan sensational comments on pawan kalyan
2019-01-06 17:19:22

పవన్ కళ్యాణ్ ఒంటరిగానే వెళ్తున్నాడా.. జనసేన తరఫున మెగా ఫ్యామిలీని ప్రచారానికి అస్సలు పిలవడా.. అసలు ఆయన మెగా కుటుంబాన్ని ప్రచారంలో వాడుకుంటాడా లేదా.. ఇప్పుడు ఇలాంటి అనుమానాలు చాలానే వస్తున్నాయి అభిమానుల్లో. దీనికి సమాధానంగా పవన్ కళ్యాణ్ లేదు అనే సమాధానమే చెబుతున్నాడు. తన యుద్ధం తాను ఒంటరిగానే చేస్తానంటున్నాడు పవర్ స్టార్. కానీ మెగా కుటుంబం మాత్రం ఈ జనసేనానిని ఒంటరిగా వదలం అంటూ హింట్లు ఇస్తుంది. సమయం వచ్చినప్పుడల్లా పవన్ కళ్యాణ్ వెంట తామంతా ఉన్నామని గుర్తు చేస్తున్నారు మెగా కుటుంబ సభ్యులు. ఓవైపు తమ్ముడు ఆదేశిస్తే కార్యకర్తలా పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని నాగబాబు చెబుతున్నాడు.
మరోవైపు ఇప్పుడు రామ్ చరణ్ కూడా తన మనసులో మాట బయట పెట్టాడు. బాబాయి అడిగిన వెంటనే ప్రచారానికి దూసుకెళ్లడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెబుతున్నాడు మెగా వారసుడు. ప్రస్తుతం తన సినిమా వినయ విధేయ రామ ప్రమోషన్స్ లో ఉన్న రామ్ చరణ్ ను జనసేన పార్టీ గురించి ప్రచారం గురించి అడిగారు విలేకరులు. దీనికి సమాధానం చెబుతూ.. ఇప్పటివరకు బాబాయ్ నుంచి పిలుపు రాలేదు.. ఒక్క ఫోన్ కాల్ వస్తే ఎగిరి పోతాను అంటూ చెప్పాడు రామ్ చరణ్. మరి అబ్బాయి కోరుకుంటున్న ఫోన్ కాల్ బాబాయ్ నుంచి వస్తుందా రాదా అనేది ఆసక్తికరంగా మారిందిప్పుడు.

More Related Stories