English   

ముందు తేజ, తర్వాత క్రిష్...ఎందుకంటే !

balakrishna clarity about Director Teja out of Balakrishna's  NTR biopic
2019-01-06 12:18:45

తెలుగు జాతి మొత్తం ఒక దేవుడిలా కొలిచే ఎన్టీఆర్ జీవితాన్ని బయోపిక్ రూపంలో ఆయన తనయుడు బాలకృష్ణ టైటిల్ రోల్ లో తెరకెక్కిస్తున్న సంగతి తెల్సిందే. అయితే ముందు ఆయన సినిమా అనుకునున్నప్పుడు తేజ దర్శకత్వంలో అనుకున్నారు. తేజ దర్శకుడిగా అట్టహాసంగా ఓపెనింగ్ ఫంక్షన్ కూడా చేశారు. తర్వాత ఏమయిందో తెలీదు కానీ తేజ తప్పుకున్నట్టు వార్తలు వచ్చాయి. దానికి బాలయ్య తేజ మధ్య గొడవలు అయ్యాయి అని కొన్ని మీడియా వర్గాలు కధనాలు కూడా వండి వార్చారు అనుకోని అది వేరే విషయం. అయితే తొలుత తేజని తీసుకున్న బాలకృష్ణ, ఆపై ఆయన స్థానంలో క్రిష్ తో సినిమాను ఎందుకు కొనసాగించాల్సి వచ్చిందో బాలకృష్ణ క్లారితే ఇచ్చారు. తాము తొలుత తేజను అనుకుని షూటింగ్ ను మొదలు పెట్టామని, కానీ తాను ఇంత బరువును మోయలేనని తేజ సతమతమయ్యాడని చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని విద్యాబాలన్ కు చెప్పేందుకు ముంబైకి వెళ్లిన వేళ, 'మణికర్ణిక' షూటింగ్ లో భాగంగా అక్కడే వున్న క్రిష్ తన వద్దకు మామూలుగా వచ్చాడని, విషయం తెలుసుకున్న క్రిష్ 'బాబూ నేను డైరెక్ట్‌ చేయనా?' అని అడిగాడని, అప్పుడు ఆలోచించి రెండే నిమిషాల్లోనే తాను నిర్ణయం తీసుకున్నానని ఆయన చెప్పుకొచ్చారు. క్రిష్ కు తెలుగు సాహిత్యం బాగా తెలుసునని, బయోగ్రఫీలు ఎన్నో చదివిన అనుభవం ఉందని అందుకే క్రిష్ అయితే తన సినిమాకు న్యాయం చేస్తాడని అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నానని అన్నారు. ఆయన కూడా తన పూర్తి డెడికేషన్ పెట్టి పనిచేశారని చెప్పుకొచ్చారు. వాస్తవానికి తేజ తరువాత చిత్రానికి తానే దర్శకత్వం వహిద్దామని అనుకున్నానని, తాను దర్శకత్వం చేసుంటే సినిమా ఇంత బాగా వచ్చుండేది కాదేమోనని బాలకృష్ణ అన్నారు.

More Related Stories