English   

అందుకే బాధ వేసింది...కాని నేను బాలయ్యని టార్గెట్ చేయలే !

nagababu opens about Nandamuri Balakrishna
2019-01-06 12:34:04

గత కొద్ది రోజులుగా మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న సంగతి తెలిసిందే. తొలుత నందమూరి బాలకృష్ణ అంటే ఎవరో తనకు తెలియదంటూ వివాదానికి ఆజ్యం పోసిన నాగబాబు. బాలయ్య మీద ఆ తర్వాత నుండి పేరు చెప్పకుండా పరోక్షంగా ఓ రేంజ్ లో సెటైర్లు వేస్తూ నందమూరి అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తున్నాడు. తాజాగా ఎన్టీఆర్ బయోపిక్ మీద కూడా కామెంట్స్ చేయడం తో ఇంకాస్త ఫైర్ అవుతున్నారు.  ఈ నేపధ్యంలో నాగబాబుకు బాలయ్య అభిమానులు ఊహించని షాక్ ఇచ్చారు. చెన్నైలోని ఓ కళాశాలలో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నాగబాబు అక్కడ విద్యార్థిని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తుండగా స్టేజీకి ముందు భాగంలో వున్న బాలయ్య బాబు అభిమానులు ఒక్కసారిగా జై బాలయ్య నినాదాలు చేయడం ప్రారంభించారు. నాగబాబు ప్రసంగిస్తున్నంత సేపు బాలయ్య బాబు అభిమానులు నినాదాలు చేస్తూనే వున్నారు. అంతేకాక బాలయ్య బాబు పాత వచ్చేలా చేసిన అభిమానులు ఆయన చేత డాన్స్ కూడా చేయించారు. దీంతో ఇగో హర్ట్ అయ్యిందో ఏమో ? నాగబాబు ఇక డైరెక్ట్ అయిపోయాడు. తన యూట్యుబ్ చానల్ నుండి ఒక వీడియో వదిలాడు. గత కొంత కాలంగా తాను ఒక వ్యక్తి మీద చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో తాను ఇప్పుడు వివరణ ఇవ్వాల్సి వస్తోందని చెప్పికోచ్చారు. వాస్తవానికి తనకు ఎవరిమీదో వ్యాఖ్యలు చేసి పాపులారిటీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. అలాగే తన అ తమ్ముడు పవన్ ఎవరో తెలేదన్నారు కాబట్టి ఆ వ్యక్తి మీద కామెంట్స్ చేసానని అనుకుంటున్నారని అది నిజం కాదని చెప్పుకొచ్చారు. నిజానికి ఆ వ్యక్తి తన కుటుంబం మీద ఆరు సార్లు కామెంట్స్ చేశాడని, అలా తమ అన్నదమ్ముల మీద కామెంట్ చేసినందుకు చాలా సరదాగా కౌంటర్ ఇచ్చాను తప్ప సీరియస్ గా ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. వాస్తవానికి తాను అసలు యా వ్యక్తిని టార్గెట్ చేయలేదని , కాని టార్గెట్ చేసినట్టు మీరు భావిస్తే సరేనని, ఆ వ్యక్తి తమ కుటుంబం మీదా సభ్య్యుల మీద చేసిన వ్యాఖ్యలు మీరు కూడా చూడండని ఒక యూట్యూబ్ థంబ్ నైల్ చూపించారు అందులో బాలకృష్ణ పవన్ ఎవరో తెలియదు అన్నట్టుగా ఉంది. అలా పవన్ ఎవరో తెలియదు అనడం కరెక్ట్ కాదని మీ బావ వచ్చి అడిగితేనే ఎన్నికల్లో జగన్ గెలవాల్సిన చోట పోటీ చేయకుండా తెలుగుదేశానికి సపోర్ట్ చేసి గెలిపించాడని అలాంటి వ్యక్తి తెలియదని మీరు అంటే మీరు తెలియదని మేము చెప్తే తప్పేముందని ప్రశ్నించారు. అలాగే సెకండ్ కామెంట్ కోసం రాత్రి తొమ్మిది గనత వరకు వేచి చూడమని ఆ వీడియోలో పేర్కొన్నారు.

More Related Stories