English   

మీరేనా సూపర్ స్టార్స్...పవన్ కళ్యాణ్ కాదా ?

Naga-Babu
2019-01-07 03:54:27

ఇటీవల బాలకృష్ణ ఎవరో తెలియదంటూ మెగా బ్రదర్ నాగబాబు చేసిన కామెంట్ చాలా వివాదాస్పదమైంది. ఆ తర్వాత కూడా అయన సోషల్ మీడియా వేదికగా వరుస కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. అయితే తాను బాలయ్యను టార్గెట్ చేయలేదని చెబుతున్న నాగబాబు అసలు తనకు కోపం ఎందుకో చెబుతూ వీడియోల రూపంలో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే దీనిపై నిన్న ఓ కామెంట్‌ను విడుదల చేసిన నాగబాబు తాజాగా ఇదే అంశంపై రెండో కామెంట్‌ ను విడుదల చేశారు. ఆ వీడియోలో  "పవన్ కల్యాణ్ ఇట్లా కామెంట్ చేశాడు మీ ఒపీనియన్ ఏంటని మీడియా వాళ్ళు అడిగితే పవన్ కల్యాణ్ తప్పుగా మాట్లాడారు, పవన్ కల్యాణ్ కరెక్ట్‌గా మాట్లాడలేదంటూ మీరు కామెంట్ చేయవచ్చు అవన్నీ మాకవసరం లేదు. మాకు మేమే హీరోలం, మాకు మేమే సూపర్ స్టార్లం అంటే వెరీగుడ్ సార్. మీకు మీరే సూపర్ స్టార్లు. మాకు అబ్జెక్షన్ లేదు. కానీ, మిగతావాళ్లు కాదా? మీరేనా సూపర్ స్టార్స్? మీరేనా గొప్పనటులు. పవన్ కల్యాణ్ కాదా? అసలు ఈ టైప్ ఆఫ్ కామెంట్ ఏంటని నాగబాబు వ్యాఖ్యానించారు. మాకు మేమే స్టార్లం. మాకు మేమే సూపర్ స్టార్లం, మాకు మేమే హీరోలం అనడం ఏంటి? ఈ విషయం మీద కామెంట్ చేయడం మాకు కుదరదా ? మాకు చేతకాదా ? మేం కౌంటర్ చేయలేమా? అయినా ఎందుకులే చూద్దాం...చూద్దాం అని చాలా ఓపిక పట్టాం. సో ఇక్కడ సూపర్ స్టార్స్ ఒక్కరే కాదు. చాలా మంది ఉంటారు స్టార్స్ ఇక్కడ. పేరున్న ప్రతి వాళ్లూ స్టార్సే మీరూ, మీకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు మాత్రమే స్టార్లు కాదు. వాళ్లొక్కళ్లే స్టార్స్ కాదు. చాలా మంది స్టార్స్ ఉన్నారు. మహేష్ బాబు అన బడే ఒక స్టార్ ఉన్నాడు. జూనియర్ ఎన్టీఆర్ అనే ఒక స్టార్ ఉన్నాడు. పవన్ కల్యాణ్ అనే ఒక స్టార్ ఉన్నాడు. మెగాస్టార్, సూపర్ స్టార్ కృష్ణ ఇలా  చాలా మంది స్టార్స్ ఉన్నారు. మీకు మీరు స్టార్ అని చెప్పుకోండి పరవాలేదు. ఎవరినో హీరోను చేయడం ఎందుకు? మీరేమీ ఎవ్వరినీ హీరోలను చేయక్కర్లేదు. మీరెవర్ని హీరోలను చేస్తారు? జనాలు హీరోలను చేస్తారు. జనాలకు నచ్చితే హీరోలవుతారు. జనాలు మెచ్చుకుంటే స్టార్స్ అవుతారు. దీనికి కూడా మేము కామెంట్ చేయవచ్చు. అయినా కూడా మేము కామ్‌ గా ఉన్నాం. దీనికి కూడా మేము కామెంట్ చేయలేదు" అంటూ ఓ వీడియోను నాగబాబు విడుదల చేశారు. దాన్ని మీరూ చూడవచ్చు.

More Related Stories