English   

అలీ పయనమెటు ?

Comedian-Ali
2019-01-07 11:21:02

కొద్దిరోజులుగా టాలీవుడ్ కమెడియన్ అలీ పొలిటికల్ ఎంట్రీ గురించే చర్చ సాగుతోంది. అసలు రాజకీయాలకు కాస్త దూరంగానే ఉంటూ వస్తున్న అలీ ప్రస్తుత రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే, ఆయన ఏ పార్టీలో చేరుతారన్నది మాత్రం చిదంబర రహస్యంగా మారుతోంది. ఎందుకంటే అలీ జరుపుతున్న వరుస భేటీలు ఆయన ఎంట్రీ మీద పలు అనుమానాలను రేపుతున్నాయి.

తాజాగా జగన్‌ ను శంషాబాద్‌ లో కలిసి చర్చలు జరిపిన అలీ వైసీపీలో చేరడం ఖాయమైపోయిందని ప్రచారం జరిగింది. అయితే దీనిని ఖండించని అలీ నిన్న పవన్ కల్యాణ్‌తో, ఇటు ఏపీ సీఎం చంద్రబాబుతో విడివిడిగా భేటీ అయ్యారు. దీంతో మరింత సందిగ్దత నెలకొంది. నిన్నటి దాకా వైసీపీలో చేరుతారనుకున్న అలీ ఇలా బాబు, పవన్‌ లతో భేటీ కావడం చర్చకు తావిస్తోంది. జగన్‌ నుంచి టికెట్ కు సంబందించిన స్పష్టమైన హామీ లభించక పోవడం వల్లే ఆయన జనసేన, టీడీపీలలో ఏదో ఒక పార్టీలో చేరేందుకు ప్లాన్ చేసుకుంటున్నారా అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, ఆయన ఒకపక్క పవన్ కు అత్యంత సన్నిహితుడు, అలాగే టీడీపీ సానుభూతి పరుడు ఈ నేపధ్యంలో ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనే దాని మీద పలు చర్చలు సాగుతున్నాయి. 

More Related Stories