English   

చిరు చిన్నల్లుడి కోసం తూనీగ భామ !

Kalyaan-Dhev
2019-01-07 05:21:49

చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ కథానాయకుడిగా ఆ మధ్య 'విజేత' అనే సినిమా వచ్చింది. కలెక్షన్ల విషయం పక్కన పెడితే ఆయనకు నటన పరంగా సోసో అనిపించినా, తనదైన స్టైల్ తో ఆకట్టుకున్నాడు. ఆ సినిమా తరువాత కొంత గ్యాప్ తీసుకున్న ఆయన, పులివాసు దర్శకత్వంలో రెండో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ముందు ఈ సినిమా అసలు సుధీర్‌బాబు, మెహ‌రీన్ జంటగా చేయాల్సింది. కారణాలు ఏమో గానీ ముందు సుధీర్ బాబు ప‌క్క‌కు త‌ప్పుకున్నారు. ఆస్థానంలో క‌ల్యాణ్‌దేవ్ జాయిన్ అయ్యారు. త‌ర్వాత కళ్యాణ్ పక్కన తను నటించనని మెహ‌రీన్‌ తప్పుకుంది. దీంతో కొత్త హీరోయిన్‌ ను వెతికే పనిలో పడ్డారు నిర్మాతలు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం 'తూనీగ తూనీగ' ఫేమ్ రియా చ‌క్ర‌వ‌ర్తిని ఈ హీరోయిన్‌ గా ఎంపిక చేసుకున్నార‌ట‌. 'హాఫ్ గర్ల్ ఫ్రెండ్', 'బ్యాంక్ చోర్', 'జలేబి' వంటి సినిమాలతో ఆమె బాలీవుడ్ యూత్ కి బాగా కనెక్ట్ అయింది. తెలుగులో సుమంత్ అశ్విన్ పక్కన 'తూనీగ తూనీగ' చేసినా ఆమెకి అది నిరాశే మిగిలింది. మళ్లీ ఇప్పుడు కల్యాణ్ దేవ్ జోడీ కట్టేందుకు సిద్ధమవుతోంది. తమన్ సంగీతాన్ని సమకూర్చుతోన్న ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ పోసాని కృష్ణమురళి కీలకమైన పాత్రలు పోషించనున్నారు.  త్వ‌ర‌లోనే ఈ విష‌యంపై అధికారిక స‌మాచారం వెలువ‌డ‌నుందని కూడా తెలుద్తోంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.  

More Related Stories