English   

జగ‌న్ పై పోసాని సినిమా.. వైసిపి ప్ర‌మోష‌న్ కోసం కొత్త ప్లాన్..

Posani-Murali
2019-01-07 13:22:40

ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాజకీయ ముఖచిత్రం మార్చేలా పొలిటికల్ మూవీస్ కూడా సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్ బయోపిక్ విడుదలకు సిద్ధమైంది.. వైఎస్ఆర్ బయోపిక్ యాత్ర ఫిబ్రవరి 8న విడుదల కానుంది. ఇప్పుడు జగన్ కు సపోర్ట్ గా మరో సినిమా కూడా రాబోతుంది. ఈ చిత్రాన్ని తెరకెక్కించబోయేది ఎవరో కాదు పోసాని కృష్ణమురళి. ఈయన జగన్ సపోర్టర్ అని చాలామందికి తెలుసు. వైసీపీలోనే ఉన్నాడు కూడా. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా అతడికి అండగా ఉన్నాడు పోసాని. ఇప్పుడు ఆయన తనయుడు జగన్ కు కూడా సపోర్ట్ చేస్తున్నాడు. ఎలక్షన్లు సమీపిస్తున్న సమయంలో జగన్ కు సపోర్ట్ గా ఒక సినిమా చేయబోతున్నాడు పోసాని. కేవలం 25 రోజుల్లో షూటింగ్ పూర్తిచేసి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నాడు ఈ దర్శకుడు. క‌డ‌ప జిల్లాలోనే షూటింగ్ అంతా జ‌ర‌గ‌నుంది. 

ఇందులో ఎవరు నటించబోతున్నారనేది ఇంకా క్లారిటీ రాకపోయినా కూడా సినిమా పూర్తిగా తెలుగుదేశాన్ని ఎండ‌గ‌ట్టేలా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. సరిగ్గా పదేళ్ల కింద చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు రాజావారి చేపల చెరువు అంటూ ఒక సెటైరికల్ సినిమా చేశాడు పోసాని. ఇప్పుడు మళ్ళీ జగన్ కు సపోర్ట్ గా అలాంటి సినిమానే ఒకటి ప్లాన్ చేయబోతున్నాడు ఈ దర్శకుడు. ఈ సినిమా కచ్చితంగా వైసిపికి ఎన్నికల్లో బూస్టప్ గా పనికొస్తుందని నమ్ముతున్నాడు పోసాని. ఇండస్ట్రీ లో జగన్ కు సపోర్ట్ గా చాలా మంది నిలుస్తున్నారు. రాజశేఖర్ దంపతులతో పాటు కమెడియన్ అలీ.. 30 ఇయర్స్ పృథ్వీ లాంటి వాళ్లు కూడా జగన్ పక్కనే ఉన్నారు. మొత్తానికి రాబోయే ఎన్నికల్లో వైసిపి ఫ్యాన్ గాలి బాగానే తీస్తుంది. మరి అది ఓట్ల రూపంలో కూడా కనిపిస్తుందో లేదో చూడాలి.

More Related Stories