English   

మోక్షజ్ఞ ఎంట్రీ మీద బోయపాటి క్లారిటీ !

Boyapati
2019-01-07 17:52:13

ఇన్నాళ్లవరకు నందమూరి అభిమానులకి రెండు కోరికలు ఉండేవి. ఒకటి ఎడమొహం పెడమొహంగా ఉన్న బాలయ్య - జూ ఎన్టీఆర్ కలవాలి, రెండు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ జరగాలి అని. దేవుడు విన్నాడో ఏమో కానీ కష్టం రూపంలో వచ్చి మరీ వాళ్ళని కలిపాడు. ఇక వాళ్ళకి మిగిలిన కోరిక మోక్షజ్ఞ ఎంట్రీ. దీని గురించి ఇప్పటి నుండే కాదు బోయపాటి లెజెండ్ సమయం నుండే చర్చ జరుగుతోంది. ప్రతి ఏటా మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడని వార్తలు రావడం తర్వాత సైలెంట్ అయిపోవడం జరుగుతూనే ఉంది. అయితే దీని మీద ఒకసారి బాలయ్యే కల్పించుకుని మరీ క్లారిటీ ఇవ్వడంతో అంతా నిజమేననుకున్నారు. కానీ అది కూడా కార్య రూపం దాల్చలేదు. అలాగే బాలయ్యతో ‘ఆదిత్య 369’ వంటి సూపర్ హిట్ ఇచ్చిన సింగీతం శ్రీనివాసరావు మోక్షజ్ఞ కోసం వాళ్ళ నాన్న సినిమా సీక్వెల్‌ సిద్ధం చేశానని, బాలకృష్ణ అంగీకరిస్తే ఆయన తనయుడిని వెండితెరకు పరిచయం చేస్తానని కూడా ప్రకటించారు. అయితే ఇవన్నీ ప్రకటనల వరకే పరిమితం అయ్యాయి. తాజాగా ఎల్లుండి విడుదల కానున్న ‘యన్.టి.ఆర్’ బయోపిక్ లో బాలకృష్ణ పాత్రను మోక్షజ్ఞ పోషించారనే ప్రచారం జరిగింది. కానీ అసలు ఈ సినిమాలో బాలయ్య పాత్రే లేదని తేల్చేయడంతో ఇది కూడా లేనట్టే. ఎలా ఉన్నా మరో ఏదాదిలోనో ఏమో మోక్షజ్ఞ ఎంట్రీ ఖాయం దీంతో మోక్షజ్ఞ తొలి సినిమాకు బోయపాటి, క్రిష్, పూరి జగన్నాథ్ పేర్లు ఎక్కువగా వినిపించాయి. నిజానికి అది ఒక గోల్డెన్ చాన్స్ అనే చెప్పాలి అలాంటి ఆఫర్ వస్తే తను  మాత్రం ఆయన్ని లాంచ్ చేయడానికి సిద్ధంగా లేనని చెబుతున్నాడు బోయపాటి. ఈ విషయం పై వినయవిధేయ రామ ప్రమోషన్స్ లో ఉన్న బోయపాటి మోక్షజ్ఞ తొలి సినిమా తనతో చేయడం కరెక్ట్ కాదని ఎందుకంటే మోక్షజ్ఞ తొలి సినిమాకు బోయపాటి డైరెక్టర్ అంటే అభిమానుల్లో అంచనాలు పెరిగిపోతాయని, వాటిని అందుకోలేకపోతే ఇబ్బందవుతుందని చెప్పుకొచ్చాడు. అందుకే మోక్షజ్ఞతో తొలి సినిమా చేయాలనుకోవడం లేదని ఆయన మూడో సినిమా అయితే చేయాలనీ అనుకుంటున్నానని చెప్పుకొచ్చాడు. 

More Related Stories