English   

యాత్ర ట్రైలర్....మాటల్లేవ్..ఎమోషన్స్ మాత్రమే !

Yatra
2019-01-07 18:09:14

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి 2004లో చేసిన పాదయాత్ర ఆధారంగా 'యాత్ర' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వైఎస్ఆర్‌గా మెయిన్ లీడ్ రోల్ ని మ‌మ్ముట్టి పోషిస్తుండగా ఈ చిత్రానికి ఆనందో బ్రహ్మ ఫేం మ‌హి వీ రాఘ‌వ దర్శకత్వం వహిస్తున్నారు. ఫిబ్ర‌వ‌రిలో విడుద‌ల అవుతున్న ఈ సినిమా మీద ముందు నుండీ భారీ అంచనాలు ఉన్నాయి. ఇక టీజర్, ఫస్ట్ లుక్స్ వంటివి రిలీజ్ చేస్తూ ఆ అంచనాలను మరింత పెంచేస్తున్నారు.

తాజాగా కాసేపటి క్రితం ఈ చిత్ర ట్రైలర్ ను యూనిట్ విడుదల చేసింది. ఆ ట్రైలర్ ప్రకారం పాద యాత్రే ఇతివృత్తంగా ఉండనుందని అర్ధమవుతోంది.  వైఎస్ పాదయాత్రలో ఎదురైన మ‌నుషులు, పాదయాత్రకు ముందు పాదయాత్ర మొదలు పెట్టాక అధిష్టానం ఎలాంటి ఒత్తిళ్లు చేసింది ? వంటివి అన్నీ తెర‌ మీద చూపించే ప్ర‌య‌త్నం చేశారు. 'నా విధేయతని, విశ్వాసాన్ని బలహీనతగా తీసుకోకండి, నాయకుడిగా మనకు ఏం కావాలో తెలుసుకోగలిగాం కానీ, జనాలకు ఏం కావాలో తెలుసుకోలేకపోయాం. తెలుసుకోవాలనుంది వినాలనుంది. ఈ గడప దాటి ప్రతీ గడపలోకి వెళ్లాలనుంది' అంటూ ట్రైలర్ లో వచ్చే సంభాషణలు ఒకరకమైన నేపధ్య సంగీతంతో వస్తుంటే రోమాలు నిక్కబోడుచుకుంటున్నాయి. ఆంధ్ర‌ ప్ర‌దేశ్‌ ఎన్నిక‌ల ముందొచ్చే ఈ సినిమా వైకాపాకి మాత్రం చాలా సహాయ పడనుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. 'ఈ సమాజంలో అన్నింటికన్నా పెద్ద జబ్బు పేదరికం' అనే డైలాగ్ మనసులను పిండేలా ఉంది.  చూడాలి ఈ సినిమా ఆ భారీ అంచనాలు అందుకుంటుందో లేదో ?

More Related Stories