English   

పీఎం నరేంద్ర మోడీ బయోపిక్ ఫస్ట్ లుక్ !

Narendra-Modi
2019-01-07 18:52:49

ఇండియాలో ఇప్పుడు ఏమి నడుస్తుంది అంటే ఫాగ్ నడుస్తుంది అనే జోక్ వినే ఉంటారు, ఇప్పుడు ఇండియాలో మాత్రం బయోపిక్ ల క్రేజ్ నడుస్తోంది. ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా ఏ వుడ్ వదలకుండా బయోపిక్ లు తెరకెక్కిస్తున్న క్రమంలో తాజాగా నరేంద్రమోడీ  బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ లీడ్ రోల్ లో నటిస్తుండగా  ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ని 23 భాషల్లో ఒకేసారి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ లాంచ్ చేశారు. నరేంద్ర మోడీ లుక్ లో వివేక్ ఒబెరాయ్ అంతగా నప్పినట్టు అనిపించడం లేదు. ఇక ఈ సినిమాకి నిర్మాతలుగా సురేశ్ ఒబెరాయ్, సందీప్ సింగ్ వ్యవహరించనున్నారు. పోస్టర్ బ్యాక్ డ్రాప్ లో ఓ వైపు జాతీయ జెండా రెపరెపలాడుతోండగా మరోవైపు ప్రజలు కనిపిస్తున్నారు. వివేక్ సరిగా నప్పకపోయినా ఓమంగ్ కుమార్ మ్యాజిక్ చేస్తాడనే నమ్మకంతో ఉన్నారు నిర్మాతలు.  ఇక ఈ బయోపిక్ షూటింగ్ ఈ నెలలో మొదలు పెడతారట. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరపి రానున్న సార్వత్రిక ఎన్నికల్లోగా ఈ సినిమా విడుదల చేయాలని చూస్తున్నారు. 
 

More Related Stories