English   

బాలయ్య ముహూర్తం పెట్టేశాడు కానీ ?

Nandamuri Balakrishna's ntr biopicmovie  first premier show release  in Bhramaramba theater
2019-01-07 12:42:38

నటసింహ నందమూరి బాలకృష్ణ మరో రెండ్రోజుల్లో తన తండ్రి లెజెండ్రీ యాక్టర్, ఉమ్మడి రాష్ట్రాల మాజీ సీఎం నందమూరి తారక రామా రావు బయోపిక్ తో మన ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద సహజంగానే చాలా అంచనాలు ఉన్నాయి. అదీ కాక తన సినిమా హిస్టరీలో లేనంతగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా చేయడంతో ఆ అంచనాలు రెట్టింపయ్యాయి. అయితే ముహూర్త బలాలను, సెంటిమెంట్ లను ఎక్కువగా నమ్మే బాలయ్య. ఈ సినిమా మొదటి షో ఎప్పుడు పడాలో ఒక ముహూర్తం కూడా చూశారట. బాలయ్య సన్నిహితుల నుండి అందుతున్న సమాచారం మేరకు ఆరోజు అంటే 9వ తేదీ ఉదయం 5 గంటల ప్రాంతంలో ముహూరర్తం సిద్దం చేశారట. అలాగే తనకు సెంటిమెంట్ గా భావించే తన అత్యంత సన్నిహితుడు నిర్మాత భవ్య ఆనంద్ ప్రసాద్ కు చెందిన భ్రమారంభ థియేటర్ లో ఆ షో వేయనున్నారట. వాస్తవానికి ఆరోజు హైద‌రాబాద్‌ లో ఎక్కడా ప్రీమియ‌ర్ షోల‌కు అనుమ‌తి ఇవ్వలేదు ప్రభుత్వం. కానీ బాల‌య్య సెంటిమెంట్ గా భ్వైస్తున్దడంతో ఆ ఒక్క థియేట‌ర్‌లోనే తెల్ల‌వారుఝామున షోకి ప్రత్యేక అనుమ‌తి తీసుకున్నారట. ఆ మొదటి ప్రీమియర్ కు బాల‌య్య‌, క్రిష్, అలాగే మొత్తం టీమ్ అందరూ వస్తారని విశ్వసనీయ సమాచారం. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విసహాయం ఏంటంటే బాలయ్య ముహూర్తం తెలంగాణాకే పరిమితం కానుంది, ఎందుకంటే ఒక్కరోజు ముందే అంటే 8నే అమెరికాలో స్పెషల్ ప్రీమియర్ లు పడే అవకాశం ఉంది, ఎటూ ఏపీలో అధికారం టీడీపీదే కాబట్టి అక్కడ కూడా విరివిగా బెనిఫిట్ షోలు పడే అవకాశం ఉంది.

More Related Stories