English   

యాత్ర ట్రైల‌ర్.. వైఎస్ఆర్ మ‌ళ్లీ పుట్టాడండోయ్..

Yatra Official Trailer released
2019-01-07 14:27:23

తెలుసుకోవాల‌ని ఉంది.. జ‌నం క‌ష్టాలు తెలుసుకోవాల‌ని ఉంది.. వాళ్లేం అనుకుంటున్నారో తెలుసుకోవాల‌ని ఉంది.. మాట ఇచ్చిన త‌ర్వాత ఏం ఆలోచించాలి చేస్తూ వెళ్లిపోవ‌డ‌మే అంటూ యాత్ర ట్రైల‌ర్ లో మ‌మ్ముట్టి చెప్పిన డైలాగ్స్ అదిరిపోతున్నాయి. ఇదంతా వైఎస్ఆర్ జీవితంలో జ‌రిగింది. 2004 ఎన్నిక‌ల‌కు ముందు ఆయ‌న చేసిన పాద‌యాత్ర రాజ‌కీయంగా ఓ సంచ‌ల‌నం. అదే ఆయ‌న్ని ముఖ్య‌మంత్రిని చేసింది. అప్ప‌ట్లో తండ్రి న‌మ్మిన సిద్ధాంతాల‌నే ఇప్పుడు జ‌గ‌న్ కూడా న‌డుస్తూ పాద‌యాత్ర చేస్తున్నాడు. ఇప్పుడు త‌న‌యుడితో పాటు మ‌ళ్లీ తండ్రి పాదయాత్ర కూడా రానుంది. వైఎస్ఆర్ బ‌యోపిక్ ట్రైల‌ర్ విడుద‌లైంది. పాద‌యాత్రే ప్ర‌ధాన క‌థ‌గా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఇందులో మ‌ళ‌యాల ఇండ‌స్ట్రీ మెగాస్టార్ మ‌మ్ముట్టి వైఎస్ఆర్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు. తెలుగు నాట ఎన్టీఆర్ త‌ర్వాత అంత‌టి మాస్ లీడ‌ర్ గా వైఎస్ రాజశేఖ‌ర్ రెడ్డికి ఇమేజ్ ఉంది. రాజ‌కీయ నాయ‌కుడు అన్న త‌ర్వాత పాజిటివ్స్ తో పాటు నెగిటివ్స్ కూడా ఉంటాయి. రాజ‌శేఖ‌ర్ రెడ్డిపై కొన్ని విమ‌ర్శ‌లు కూడా ఉన్నాయి.. చాలా అలిగేష‌న్స్ ఉన్నాయి కానీ చ‌నిపోయిన వ్య‌క్తి గురించి ఇప్పుడు అవ‌న్నీ మాట్లాడ‌టం స‌రికాదు.
ఆనందో బ్ర‌హ్మ లాంటి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న మ‌హి వి రాఘ‌వ ఇప్పుడు వైఎస్ఆర్ బ‌యోపిక్ చేస్తున్నాడు. వైఎస్ చ‌నిపోయి 9 ఏళ్లు అవుతున్నా ప్ర‌జ‌ల గుండెల్లో అంతులేని అభిమానం అయితే ఉంది. ఈ రోజుల్లో ఓ లెజెండ్ క‌న్నుమూస్తే వెంట‌నే బ‌యోపిక్ తీస్తున్నారు. కానీ కార‌ణం తెలియ‌దు కానీ వైఎస్ చ‌నిపోయి 9 ఏళ్ల‌వుతున్నా ఇప్ప‌టికీ ఆయ‌న జీవితంపై ఎవ‌రూ సినిమా చేయ‌లేదు. అప్ప‌ట్లో రాజ‌శేఖ‌ర్ రెడ్డి అనే సినిమాను పూరీ అనౌన్స్ చేసాడు. రాజ‌శేఖ‌ర్ ఇందులో హీరోగా న‌టించాల‌ని ఫిక్స‌య్యాడు కూడా. కానీ అనివార్య కార‌ణాల‌తో ఆ సినిమా ప‌ట్టాలెక్క‌కుండానే అట‌కెక్కింది. మ‌ళ్లీ ఇన్నేళ్ల‌కు వైఎస్ఆర్ బ‌యోపిక్ సెట్స్ పైకి వ‌చ్చింది. మ‌మ్ముట్టిని ఒప్పించి ఈ సినిమాను తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ళ‌యాల భాష‌ల్లోనూ తెర‌కెక్కిస్తున్నాడు మ‌హి వి రాఘ‌వ‌. ఇప్ప‌టికే షూటింగ్ కూడా పూర్తైపోయింది. ఇప్పుడు ట్రైల‌ర్ లో కూడా మొత్తం పాద‌యాత్ర‌తో పాటు ఆయ‌న ప‌డిన క‌ష్టాలు కూడా చూపించాడు. ట్రైల‌ర్ చూస్తుంటేనే సినిమా ఎలా ఉండ‌బోతుందో ఓ ఐడియా అయితే వ‌చ్చేస్తుంది. ఈ చిత్రంలో యాత్ర ఎంత కీల‌క‌ఘ‌ట్ట‌మో తెలుస్తుంది. మ‌రి చూడాలిక‌.. వైఎస్ బ‌యోపిక్ ఎలా ఉండ‌బోతుందో..? ఫిబ్ర‌వ‌రి 8న విడుద‌ల కానుంది ఈ చిత్రం.

More Related Stories