English   

బికినీతో మ‌తులు పోగొట్టిన త‌మ‌న్నా, మెహ్రీన్.. 

Mehreen-Kaur
2019-01-08 04:24:33

ఎఫ్ 2 సినిమాకు యు బై ఎ సర్టిఫికెట్ వస్తే ఏమో అనుకున్నారు ప్రేక్షకులు. అనిల్ రావిపూడి చేసింది పూర్తిస్థాయి కామెడీ ఎంటర్టైనర్ కదా.. పైగా ఫ్యామిలీ సినిమా కూడా.. ఎందుకు దీనికి యు బై ఎ సర్టిఫికెట్ ఇచ్చారు.. క్లీన్ యు సర్టిఫికెట్ ఇవ్వొచ్చు కదా అనుకున్నారు ఆడియన్స్. కానీ ఇప్పుడు ట్రైలర్ విడుదలైన తర్వాత ఎందుకు దీనికి యుకు తోడుగా ఏ స‌ర్టిఫికేట్ కూడా ఇచ్చారో అర్ధం అవుతుంది. ఇందులో కామెడీతో పాటు హీరోయిన్ల అందాల ప్రదర్శన కూడా భారీగానే ఉంది. గత సినిమాలతో పోలిస్తే కాస్త ఘాటుగానే రెచ్చిపోయారు తమన్నా, మెహరీన్.

తాజాగా విడుదలైన ట్రైలర్ లో ఏకంగా బికినీలో కనిపించారు ఇద్దరు ముద్దుగుమ్మలు. ఇది చూసిన తర్వాత సినిమాకు యు బై ఎ ఎందుకు ఇచ్చారో క్లారిటీ వ‌చ్చేసింది. కేవలం ఆ ఒక్క సీన్ లోనే కాకుండా మిగతా సీన్స్ లో కూడా ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు బాగానే అందాలు ఆరబోశారు. సినిమాకు వీళ్ళ గ్లామర్ అదనపు ఆకర్షణ. మొత్తానికి ట్రైలర్ లోనే ఇంతగా రెచ్చిపోతే రేపు సినిమా విడుదలైన తర్వాత ఇంకెంతగా రెచ్చిపోయి ఉంటారు అని అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. మరి వాళ్ళ ఆశలు తమన్నా, మెహరీన్ ఇంత వరకు నిలబెడతారో చూడాలి.

More Related Stories