English   

మెగా బ్ర‌ద‌ర్స్ సంక్రాంతి వార్.. 

varun-tej
2019-01-08 05:17:09

సంక్రాంతి పండక్కి అంతా నాలుగు సినిమాలు వస్తున్నాయి అంటూ ప్రచారం చేస్తున్నారు కానీ ఈ నాలుగు సినిమాల్లో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు.. ఒకే కుటుంబం నుంచి ఒకే రోజు గ్యాప్ లో మెగా హీరోలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడబోతున్నారు. నందమూరి, మెగా హీరోలు పోటీలో ఉండటంతో మెగా వర్సెస్ మెగాపై ఎవరు దృష్టి పెట్టడం లేదు. కానీ మెగా అభిమానుల్లో మాత్రం ఈ వార్ పై మంచి ఆసక్తి, అంచనాలు ఉన్నాయి. జనవరి 11న రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ విడుదల కానుంది. ఇక ఆ తర్వాత రోజే వరుణ్ తేజ్ నటించిన ఎఫ్2 రానుంది. ఇలా అన్నదమ్ములు నటించిన సినిమాలు ఒకే రోజు గ్యాప్ లో వస్తుండటంతో అంచనాలు బాగానే ఉన్నాయి.

ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారో అంటూ అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా చూస్తున్నారు. ఎవరో ఒకరు గెలవడం కంటే కూడా పండక్కి వచ్చి ఇద్దరూ గెలిస్తే ఆ మజానే వేరు అంటున్నారు మెగా అభిమానులు. చరణ్, వరుణ్ కూడా ఇదే ఊహిస్తున్నారు. రెండు సినిమాలు రెండు రోజుల్లో వస్తున్నా కూడా కచ్చితంగా ప్రేక్షకులను మెప్పిస్తాయ‌ని.. రెండింటిలోనూ వాళ్లను అలరించే అంశాలు చాలానే ఉన్నాయని చెబుతున్నారు ఈ మెగా సోదరులు. పనిలో పనిగా ఒకరి సినిమాని మరొకరు ప్రమోట్ చేసుకుంటున్నారు. మరి ఈ మెగా అన్నదమ్ముల సమరంలో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.

More Related Stories