English   

మెగా హీరోల‌ను వ‌ద‌ల‌నంటున్న బాల‌య్య‌.. 

Balakrishna
2019-01-08 13:48:21

ఇండస్ట్రీలో బాలకృష్ణకు మరో పేరు కూడా ఉంది.. అదే సంక్రాంతి బాలయ్య అని. ఎన్నో ఏళ్లుగా ఎన్నో పండగకు తన సినిమాలను తీసుకువచ్చి విజయాలు అందుకొంటున్నాడు ఈ హీరో. గత రెండేళ్లలో కూడా గౌతమీపుత్ర శాతకర్ణి, జై సింహా లాంటి సినిమాలతో వ‌చ్చి హిట్లు కొట్టాడు బాలయ్య. ఈ ఏడాది కూడా కథానాయకుడు సినిమాతో పండక్కి వస్తున్నాడు ఈయ‌న‌. అయితే ప్రతి పండుక్కి మెగా హీరోలను టార్గెట్ చేయడం అలవాటు చేసుకున్నాడు బాలయ్య. 2017లో చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాకు పోటీగా గౌతమీపుత్ర శాతకర్ణి విడుదల చేశాడు. 2018లో పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమాకు పోటీగా జైసింహ సినిమాను తీసుకొచ్చాడు బాలకృష్ణ. అప్పుడు చిరంజీవితో పాటు హిట్ కొట్టిన బాలయ్య.. 2018లో మాత్రం పవన్ కళ్యాణ్ ను ఓడించి జై సింహతో సంక్రాంతి విన్నర్ అనిపించుకున్నాడు. 

ఇక ఈ ఏడాది కూడా ఇద్దరు మెగా హీరోలతో కలిసి పండక్కి వస్తున్నాడు బాలయ్య. జనవరి 9న ఈయన నటించిన కథానాయకుడు విడుదలవుతుంటే.. 11న రామ్ చరణ్.. 12న వరుణ్ తేజ్ సినిమాలు వస్తున్నాయి. ఇద్దరు మెగా హీరోలతో బాలయ్య సమరం సాగించ‌నున్నాడు. ప్రతిసారి మెగా హీరోలతో పోటీ పడినప్పుడు బాలయ్య రేస్ లో కాస్త ముందున్నాడు. అప్పట్లో చిరంజీవి మృగరాజు సినిమాకు పోటీగా నరసింహనాయుడు తీసుకొచ్చి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు బాలయ్య. దానికి ముందు కూడా సంక్రాంతికి చిరంజీవితో పోటీపడి విజయం సాధించాడు ఈ నందమూరి హీరో. ఇక ఇప్పుడు మరోసారి మెగా హీరోలతో సమరానికి సై అంటున్నాడు బాలకృష్ణ. 2019లో ఎన్టీఆర్ బయోపిక్.. రామ్ చరణ్, వరుణ్ తేజ్ సినిమాలను ఎంతవరకు నిలవరిస్తుందో చూడాలి.

More Related Stories