English   

సంక్రాంతికి ఏపీ గ‌వ‌ర్న‌మెంట్ ఆఫ‌ర్..!!

Tollywood
2019-01-08 06:58:08

సంక్రాంతి పండక్కి పండగ చేసుకునే ఆఫర్ ఇచ్చింది ఏపీ గవర్నమెంట్ నిర్మాతలకు. ప్రభుత్వం ఇచ్చిన వరంతో కాసుల పంట పడటం ఖాయంగా కనిపిస్తుంది. పండగ సెలవులు ఉన్న ఈ వారం రోజులు అదనంగా రెండు షోలు ప్రదర్శించుకోవచ్చని అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. దాంతో నిర్మాతలు నిజంగానే పండ‌గ చేసుకుంటున్నారు. రోజుకు నాలుగు షోలు మాత్రమే అనుమతి ఉన్న ఏపీలో ఇప్పుడు మ‌రో రెండు షోలు అద‌నంగా వేసుకోవచ్చని తెలిసి ఆనందిస్తున్నారు థియేటర్ యాజమాన్యం. దీని వల్ల వస్తున్న సినిమాలకు పండగ సెలవులు బాగా కలిసి రానున్నాయి. దానికి తోడు పాజిటివ్ టాక్ వచ్చింది అంటే నిర్మాతలకు లాభాల పంట పండటం ఖాయం. 

ఇప్పుడు ఉన్న మార్కెటింగ్ స్ట్రాటజీకి వారం రోజులు సినిమా బాగా ఆడింది అంటే పెట్టుబ‌డి వెన‌క్కి వ‌చ్చేస్తుంది. పెద్ద సినిమాలకు 100 కోట్లు వ‌సూలు చేడ‌యం కూడా లెక్క కాదు. పండక్కి విడుదల అవుతున్న ఎన్టీఆర్ బయోపిక్, వినయ విధేయ రామ సినిమాలకు 100 కోట్లు వసూలు చేసే సత్తా ఉంది.. దాంతోపాటు ఎఫ్ 2 సినిమాకు కూడా దాదాపు 50 కోట్లు వసూలు చేసే స్టామినా ఉంది.. ఇక రజనీకాంత్ పేట కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే భారీ వసూళ్లు రావడం ఖాయం. పండగ సినిమాలకు ఇప్పుడు అదనంగా రెండు షోలు ప్రదర్శించుకోవడం అనే మాట వరంగా మారుతుంది. మరి దీన్ని ఎంతవరకు పండగ సినిమాలు ఉపయోగించుకుంటాయి అనేది చూడాలి.

More Related Stories