English   

యాత్ర ప్రీ రిలీజ్ కోసం జగన్ !

YS-Jagan
2019-01-08 08:12:52

వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి రాక ముందు చేసిన మహా పాద యాత్ర ఆధారంగా 'యాత్ర' బయోపిక్ నిర్మితమైన సంగతి తెలిసిందే. ఆనందో బ్రహ్మ వంటి హిట్ లను అందించిన మహి వి రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, ఫిబ్రవరి 8వ తేదీన విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. అందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా చేశారు. ఇక తాజాగా విడుదలయిన ఈ సినిమా ట్రైలర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. ఒకరకంగా ఈ ట్రైలర్ అంచనాలను డబుల్ చేసిందని చెప్పక తప్పదు. ఈ నేపథ్యంలో ఈ సినిమా కోసం ఫిబ్రవరి 1వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒక దానిని ఏర్పాటు చేసి దానిని ఏపీలో ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి చెందుతున్న వైజాగ్ లో నిర్వహించాలని నిర్మాతలు భావిస్తున్నారట. అలాగే ఈ వేడుకకి వైఎస్ కుటుంబాన్ని ఆహ్వానిస్తుండగా ముఖ్యంగా జగన్ ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ అని తెలుస్తోంది. ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసినప్పుడు దర్శకుడు ఏకంగా జగన్ పాదయాత్ర చేస్తున్న చోటుకి వెళ్లి మరీ ఈ టీజర్ ఆయనకు చూపించి వచ్చారు. ఆ సమయంలోనే జగన్ ను ఈ ఈవెంట్ కు పిలిచారని జగన్ కూడా వస్తానని చెప్పాడని అంటున్నారు. జగన్ కుటుంబం మొత్తం దీనికి హాజరయ్యే అవకాసం ఉంది. అదీకాక గత ఎన్నికల్లో వైఎస్ భార్య విజయమ్మ వైజాగ్ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు, ఈ నేపధ్యంలో వైజాగ్ జనాలు అబ్బురపడేలా ఈ వేడుక జరపాలని అది వచ్చే ఎన్నికల్లో వైసీపీకి చాలా ప్లస్ అవుతుందని వైసీపీ భావిస్తోంది.

More Related Stories