English   

నాగబాబు కామెంట్స్ పై బాలయ్య కామెంట్ ! 

Balakrishna
2019-01-08 10:08:35

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో బాలకృష్ణ వీడియోలతో మెగా బ్రదర్ నాగబాబు హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన వరుసగా బాలయ్య వీడియోలు పోస్ట్ చేస్తూ బాలయ్యని టార్గెట్ చేశారు. అయితే కొద్ది రోజులుగా బాలయ్య కధానాయకుడు ప్రమోషన్స్ లో పాల్గొంటున్నా ఈ విషయాన్ని ఎవరూ ప్రస్తావించే ధైర్యం చేయలేదు. కానీ ఈరోజు ఆయన సినిమా రిలీజ్ కోసం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం బయటకు వచ్చిన వెంటనే ఈ వివాదం మీద స్పందిన్చాల్సిందిగా బాలయ్యనే నేరుగా అడిగేశారు అక్కడి ప్రెస్ వారు. అయితే ఒక్కసారిగా పెద్దగా నవ్వేసిన బాలకృష్ణ..‘ఇది సమయం కాదు’ అంటూ హుందాగా తప్పుకున్నారు. అనంతరం తనతో పాటు దర్శనానికి వచ్చిన క్రిష్, విద్య, కళ్యాణ్ రామ్ లతో కలిసి వెళ్ళిపోయారు. అలాగే తిరుపతి పీజేఆర్‌ మూవీ ల్యాండ్‌ లో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని బాలకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి 100కు పైగా థియేటర్లలో ఎన్టీఆర్‌ విగ్రహాలు పెడుతున్నామని అన్నారు. సీఎంగా మొదటిసారి జనవరి 9న ఎన్టీఆర్‌ ప్రమాణస్వీకారం చేశారని, అదే రోజు ఎన్టీఆర్‌ కథానాయకుడు చిత్రాన్ని యాధృచ్చికంగానే విడుదల చేస్తున్నామని అన్నారు.

More Related Stories