English   

బాలీవుడ్ తో ఆడుకుంటున్న మ‌న్మోహ‌న్.. థాక‌రే.. 

Thackeray
2019-01-08 18:28:50

బాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కడ విన్నా ఆ రెండు బయోపిక్ ల గురించే చర్చ నడుస్తుంది. ఎందుకంటే అవి విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తున్నాయి కాబట్టి. పైగా రెండు సినిమాలు ఇద్ద‌రు లెజెండ్స్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న‌వే. అవే ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అండ్ థాకరే సినిమాలు. ఈ రెండూ జనవరిలోనే విడుదల కానున్నాయి. ముందుగా యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ జనవరి 11న విడుదల కానుంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. 2003కు ముందు కాంగ్రెస్ లో ఉన్న పరిస్థితులు.. అప్పుడు గెలిచిన కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ ను ప్రధానమంత్రి చేయడం.. ఆ తర్వాత ఆయనతో ఇష్టం వచ్చినట్లు ఆడుకోవడం ఇవన్నీ ఈ సినిమాలో చూపిస్తున్నారు దర్శకనిర్మాతలు. మన్మోహన్ సింగ్ పిఏ సంజయ్ బారు రాసిన పుస్తకం ఆధారంగా యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ సినిమా తెరకెక్కింది. 

ఈ సినిమా మన్మోహన్ సింగ్ ప్రతిష్టను దిగజార్చేలా ఉంది అంటూ హైకోర్టు కూడా యూట్యూబ్ నుంచి ట్రైలర్ ను డిలీట్ చేయాలని ఆదేశించింది. ఇక యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ తో పాటు బాలీవుడ్ లో అందరి దృష్టిని ఆకర్షిస్తూ విడుదలకు ముందే కాంట్రవర్సీ రేపుతున్న మరో సినిమా థాకరే. మహారాష్ట్ర సింహం బాల్ థాకరే జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. జనవరి 23న సినిమా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ అనేక వివాదాలు సృష్టించింది. ఇందులో నవాజుద్దీన్ సిద్ధిఖి టైటిల్ రోల్ చేశాడు. ట్రైలర్ చూస్తుంటే కాంట్రవర్సీలతో నిండిపోయింది. ఇక విడుదలైన తర్వాత ఈ చిత్రం ఇంకా ఎన్ని కొత్త కాంట్రవర్సీలకు తెరతీస్తుందో అని భయపడుతున్నారు రాజకీయ నేతలు. మొత్తానికి జనవరిలో రెండు కాంట్రవర్షియల్ బయోపిక్స్ బాలీవుడ్ ను వ‌ణికిస్తున్నాయి. 

More Related Stories