English   

అశోక్ వ‌ల్ల‌భ‌నేనిపై ఫైర్ అయిన దిల్ రాజు..!!

Dil-Raju
2019-01-08 18:38:31

2019 సంక్రాంతి టాలీవుడ్ కు పెద్దగా కలిసి రానట్లుంది. సినిమాలు విడుదల కాకముందే యుద్ధాలు జరుగుతున్నాయి. బాక్సాఫీస్ దగ్గర జరిగే యుద్ధం ప్రేక్షకులకు కిక్ వ‌స్తుందేమో కానీ ఇప్పుడు నిర్మాత‌ల‌ మధ్య జరుగుతున్న మాటల యుద్ధం మాత్రం ఇండస్ట్రీలో జరుగుతున్న విషయాల గురించి క్లారిటీ ఇస్తుంది. థియేటర్ల మాఫియా అంటూ పేట ప్రీ రిలీజ్ వేడుకలో నిర్మాత అశోక్ వల్లభనేని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. దీనికి కౌంటర్ గా దిల్ రాజు సీరియస్ గా రియాక్ట్ అయ్యాడు. ఆరునెలల ముందే పండక్కి వస్తామంటూ సినిమా విడుదల తేదీని ఫిక్స్ చేసిన తాము పిచ్చివాళ్లమా అంటూ సీరియస్ అయ్యాడు దిల్ రాజు. 

ఎప్పటినుంచో పండక్కి రావాలని విడుదల తేదీలు ముందే ప్రకటించుకొని థియేటర్స్ బుక్ చేసుకుని ఉంటే ఇప్పుడు వారం రోజుల గ్యాప్ లో ఒక డబ్బింగ్ సినిమా తీసుకొచ్చి థియేటర్లు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నిస్తున్నాడు దిల్ రాజు. పండక్కి మూడు భారీ సినిమాలు మనవే వస్తున్నప్పుడు ఎక్క‌డి నుంచో వ‌చ్చిన అనవాద చిత్రానికి థియేటర్లు ఎక్కడినుంచి దొరుకుతాయి అంటున్నాడు రాజు. తెలుగులో మూడు భారీ సినిమాలు సంక్రాంతి పండగకి వస్తున్నాయ్ అని తెలిసినప్పుడు ఎందుకు ఇప్పుడు డబ్బింగ్ సినిమా విడుదల చేయడం అంటున్నాడు దిల్ రాజు. 

థియేటర్లు లేవు అని అశోక్ అంటున్నాడ‌ని.. ఎక్క‌డ్నుంచి వ‌స్తాయి.. ఇప్పుడు వ‌స్తున్న మూడు భారీ సినిమాలకే థియేటర్లు సరిపోవడం లేదు ఇక్కడ.. ఇక డబ్బింగ్ సినిమాకు ఎక్కడినుంచి ఇచ్చేది అంటున్నాడు ఈ నిర్మాత. నిజానిజాలు తెలుసుకోకుండా అశోక్ వల్లభనేని అనుచిత వ్యాఖ్యలు చేశారని కోప్పడ్డాడు దిల్ రాజు. ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్ గా చాలా నష్టపోయాన‌ని.. ఇలాంటి టైమ్ లో తాను రిస్కు తీసుకోలేనంటున్నాడు ఈ నిర్మాత. జనవరి 12న ఈయ‌న నిర్మించిన ఎఫ్ 2 విడుదల కానుంది. మొత్తానికి థియేటర్ల రచ్చ ఎక్కడ ముగుస్తుందో చూడాలి.

More Related Stories