English   

జ‌న‌సేన‌కు అలీ ఎందుకు దూరంగా జ‌రిగాడు..? 

Ali-pawan
2019-01-08 11:59:45

పవన్ క‌ళ్యాణ్ పార్టీ ఉండగా అలీ వైసీపీలో ఎందుకు చేరుతున్నాడు... జగన్ వైపు ఎందుకు వెళ్తున్నాడు.. ఇప్పుడు అభిమానుల్లో వస్తున్న అనుమానాలు ఇవే. దీనిపై అలీ స్పందించాడు. తాను ఎందుకు పవన్ కళ్యాణ్ ను కాదని ఇతర పార్టీల వైపు చూస్తున్నాన‌నేది కారణాలు చెప్పాడు ఈ క‌మెడియ‌న్. పవన్ క‌ళ్యాణ్ పార్టీలో చేరాలని అనుకోలేదని.. ఒకవేళ అలా అనుకున్నా కూడా పవన్ వద్దంటాడని చెబుతున్నాడు ఆలీ. పవన్ పార్టీ పెట్టేటప్పుడు ఎవరి సలహాలు తీసుకోలేదని.. ఏం చేయాలి అని ఎవరిని అడగడ‌ని.. తనకు ఏది మంచి అనిపిస్తే అది ప్రజలకు ఉపయోగ పడుతుందని నిజంగా భావిస్తే చేసుకుంటూ వెళ్ళిపోతాడు అంటున్నాడు ఈయ‌న‌. 

తన పార్టీలోకి ఎవరైనా వస్తానంటే ఏమి ఆశించి వస్తున్నారు అని అడుగుతాడని.. నిజంగానే ఏదైనా ఆశిస్తే అది తన దగ్గర దొరకదు ముందే చెప్పేస్తాడ‌ని చెబుతున్నాడు అలీ. తాను వెళ్లి పవన్ ను కలిసినప్పుడు జనసేనలో చేరే టాపిక్ రాలేదని.. తన ఛాయిస్ ఇప్పుడు వైసిపి అంటూ చెప్పకనే చెప్పాడు ఈ కమెడియన్. తనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఆ తర్వాత మంత్రి పదవి ఇస్తాము అని చెబితే ఏ పార్టీ నుంచి పోటీ చేయడానికి అయినా తాను సిద్ధంగా ఉన్నానంటున్నాడు కమిడియన్ అలీ. గుంటూరు వ‌న్ లేదంటే 2 నుంచి సీటు ఇస్తే వైసీపీ నుంచి పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు ఈయ‌న‌. అయితే కచ్చితంగా మంత్రి పదవి కావాలి అనే కండిషన్ పెడతానని చెబుతున్నాడు. 

ఒకవేళ మంత్రి పదవి ఇవ్వను అంటే మాత్రం సింపుల్ గా సారీ చెప్పి వెనక్కి వచ్చేస్తానంటున్నాడు ఈయ‌న‌. ఈ ఆఫ‌ర్ టిడిపికి కూడా వర్తిస్తుందని.. మంత్రి పదవి ఇస్తానంటే వెళ్తానంటున్నాడు అలీ. ఒకవేళ నిజంగానే పవన్ కళ్యాణ్ కూడా పిలిచి గుంటూరు సీట్ ఇచ్చి మంత్రి పదవి ఇస్తానంటే వెళ్లడానికి తనకేమీ అభ్యంతరం లేదని కానీ అది జరిగేలా కనిపించట్లేదు అంటున్నాడు ఈయ‌న‌. అందుకే వైసీపీ గూటికి చేరాలని ఫిక్స‌య్యాడు అలీ. తాను ఇప్ప‌టికే ఒక తేదీ నిర్ణయించుకున్నానని ఆలోపు ఏ పార్టీ పిలిచినా వెళ్తానని.. కానీ చివ‌రికి తాను అనుకున్న రోజు ఏ పార్టీ నుంచి పోటీ చేయాలనుకుంటున్నాను అనేది వివరంగా చెప్తాను అంటున్నాడు అలీ. మరి ఈయన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చూడాలి.

More Related Stories