English   

జయసుధ, జయప్రద కాదని లక్ష్మీ పార్వతినే ఎందుకు ?

Lakshmis-NTR
2019-01-08 12:22:40

తెలుగు ప్రజల ఆరాధ్య దైవంగా పిలవబడే నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా మొత్తం నాల్లుగు సినిమాలు తెరకేక్కుతున్నాయి. అందులో రెండు సినిమాలను ఆయన కొడుకు బాలకృష్ణ స్వయంగా నటిస్తూ నిర్మిస్తుండగా మరో రెండు ఒకటి వర్మ, మరొకటి కేతిరెడ్డి తెరకేక్కిస్తున్న్నారు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే బాలకృష్ణ తీస్తున్న సినిమాలో ఆయన జననం, బాల్యం నుండి ఆయన జీవితంలోకి లక్ష్మి పార్వతి ఎంటర్ అయ్యే వరకు ఉంటుందని భావిస్తున్దాగం, వర్మ సినిమా ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మి పార్వతి ఎంటర్ అయ్యాక నుండి మొదలవుతుంది. ఇక కేతిరెడ్డి సినిమా ఏమో లక్ష్మి పార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి ఎలా ఎంటర్ అయ్యింది అనే అంశం మీద తెరకెక్కిస్తున్నారు. అయితే లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే పేరుతో వర్మ తెరకెక్కిస్తున్న సినిమాకు రెండో పాట ‘ఎందుకు’ టీజర్ ట్రైలర్ ను వర్మ విడుదల చేశారు. ‘జయసుధ, జయప్రద, శ్రీదేవిలని కాదని లక్ష్మీపార్వతిని ఎందుకు?.. ఎందుకు?’ అంటూ సాగుతున్న పాట టీజర్ ను వర్మ ఈరోజు విడుదల చేశారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు పూర్తి పాటను  విడుదల చేస్తానని అందులో ప్రకటించాడు. సో ఈవెనింగ్ దాకా వెయిట్ చేస్తే వర్మ లెక్క ఏంటో తెలిసిపోతుందన్నమాట.

More Related Stories