English   

సాయి పల్లవి అంత పని చేసిందా ?

Sai-Pallavi
2019-01-08 19:42:20

చేసిన మొదటి సినిమాతోనే మన పక్కింటి పిల్లలా అచ్చ తెలుగు ఆడపిల్లలా మారిపోయిన 'ఫిదా' హీరోయిన్ సాయి పల్లవి చేసిన పని ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిజానికి ఈ అమ్మడు తన మొదటి రెండు సినిమాలు హిట్ కొట్టాక తన రెమ్యునరేషన్ ను అమాంతం పెంచేసినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి.  ఆమె డేట్స్ కోసం పెద్ద సంస్థలు ప్రయత్నిస్తే రెమ్యునరేషన్ గా వారు ఊహించని మొత్తాన్ని అడిగిందని, దీంతో అవాక్కైన నిర్మాతలు వెనుదిరిగారని ఆ వార్తల సారాంశం. అయితే ఈ అమ్మడు నిజంగా రెమ్యునరేషన్ పెంచిదో లేదో తెలీదు కానీ. తాను మాత్రం మనసున్న మనిషిని అని నిరూపించుకుంది. ఎందుకంటారా ? తాజాగా ఈ మల్లు భామ ప‌డి ప‌డి లేచే మ‌న‌సు అనే చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించింది. శ‌ర్వానంద్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా అందాల రాక్షసి ఫేం హ‌ను రాఘ‌వ‌పూడి తెర‌కెక్కించారు. సినిమాలో శ‌ర్వానంద్‌, సాయి ప‌ల్ల‌విల న‌ట‌నకి మంచి పేరొచ్చినా క‌థ జ‌నాల‌కి రొటీన్ అనిపించడంతో పెడగా ఆదరించలేదు. దీంతో ఈ చత్రా నిర్మాత‌ల‌కి కాస్త భారీగానే న‌ష్టం కూడా చేకూరిందట. అయితే ఈ విష‌యం తన మ్యానేజర్ ద్వారా సాయిప‌ల్ల‌వికి కూడా చేరిందట. దీంతో ఆమె త‌న రెమ్యున‌రేష‌న్‌ని తిరిగి నిర్మాత‌ల‌కే ఇచ్చేసిందని ఫిలిం నగర్ లో గుసగుసలాడుకున్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు స్టార్ హీరోలు, వినాయక్, లారెన్స్ లాంటి స్టార్ డైరెక్టర్ లు మాత్ర‌మే త‌మ రెమ్యున‌రేష‌న్‌ ని ఇలా తిరిగి ఇచ్చేసిన దాఖలాలు చూశాం. కాని జ్యూస్ లు మొదల నిర్మాతల డబ్బుని రక్తం తాగినట్టు తాగుతారు అని సామాన్యులు భావించే హీరోయిన్ త‌న పారితోషికాన్ని రిట‌ర్న్‌గా ఇవ్వ‌డ‌మ‌నేది చాలా అద్భుతమైన విష‌యం. అందుకే సాయి ప‌ల్ల‌వి చేసిన ప‌నికి ఆమే ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు సినీ పెద్దలు. లాంగ్ లివ్ సాయి పల్లవి !

More Related Stories