English   

కేరళ అడవుల్లో రానా షూటింగ్ !

Rana Daggubati off to Kerela to start shooting Haathi Mere Saathi
2019-01-08 13:26:36

1971లో రాజేష్ ఖన్నా ప్రధాన పాత్రలో వచ్చిన బాలీవుడ్ మూవీ "హాథీ మేరే సాథీ" బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. తాజాగా అదే చిత్రాన్ని నటుడు రానా హీరోగా ఇప్పటి నేటివిటీకి తగ్గట్టుగా రీమేక్ చేస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం ఏకకాలంలో తెరకెక్కుతోంది. ప్రభు సాల్మన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఆద్యంతం అడవిలోనే, అ బ్యాక్ గ్రౌండ్ లోనే సాగుతుంది. అడవిలోని ఉన్న ఒక ఏనుగుకి ఒక మనిషికి మధ్య ఉన్న అనుబంధమే కధా వస్తువుగా ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలను థాయ్ లాండ్ లోని దట్టమైన అడవుల్లో చిత్రీకరించారు. అక్కడితో మొదటి షెడ్యూల్ ముగిసింది. ఆ తరువాత ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు. ఈ బ్రేక్ లోనే రానా ఎన్టీఆర్ బయోపిక్ లో చంద్రబాబు పాత్రను చేసేశారు. మళ్లీ ఈరోజు నుండి 'హాథీ మేరే సాథీ' రెండో షెడ్యూల్ షూటింగ్ కేరళలో మొదలైందట. కేరళ అడవుల్లో రానా మీద కొన్ని సన్నివేశాలను ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ షెడ్యూల్ తో చిత్రీకరణ మొత్తం పూర్తవుతుందని అంటున్నారు. తమిళంలో కుంకీ(గజరాజు) సినిమాను తీసిన ప్రభు ఆ సినిమాతో మంచి హిట్ అందుకున్నారు. గత ఏడాది దీపావళికే సినిమా విడుదదల అవ్వాల్సి ఉన్నా కారణాలు తెలియదు కానీ ఇప్పటికీ షూటింగ్ పూర్తవలేదు. ఈ ఏడాది దీపావళికయినా విడుదలవుతుందో లేదో ? తెలుగులో 'అరణ్య' పేరుతో, తమిళంలో 'కాదన్' పేరుతో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

More Related Stories