English   

హైపర్ భజన...నటన కూడా అక్కర్లేదట !

hyper aadi about janasena party pawan kalyan
2019-01-08 15:43:42

జబర్దస్త్ మొదలయి దాదాపు ఐదేళ్ళు కావస్తున్నా అస్సలు బోర్ కొట్టట్లేదంటే అందుకు ఒక కారణం తాజాగా వస్తున్న ఆది లాంటి యంగ్ స్టర్స్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. తాజాగా ఆయన జబర్దస్త్ లో కనిపించకపోయే సరికి ఆదికి యాక్సిడెంట్ అయ్యిందని కొన్ని యూట్యూబ్ ఛానెల్‌లు ప్రచారం చేశాయి. ఆ తర్వాత తాను బానే ఉన్నానని చెప్పిన ఆది ఎందుకో షోలో రాలేదనే కారణం మాత్రం చెప్పలేదు. అయితే ఆయన నిన్న పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో జరిగిన జనసేన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. దీంతో అయన షోకి దూరమయ్యింది పవన్ పార్టీ కోసమేనని అంటున్నారు. ఈ సందర్భంగా ఆది తన నటనకు సంబంధించి కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. పవన్‌ మంచి వ్యక్తి మాత్రమే కాదని మొండి వ్యక్తి అని ప్రజల కోసం కష్టపడుతున్న పవన్‌ ను అందరూ సపోర్ట్ చేసి అధికారంలోకి వచ్చేలా చేయాలని కోరారు.  అలాగే 2009లో రాజకీయాల్లోకి వచ్చిన మంచి వ్యక్తిని అందరూ ముంచేశారు. 2019లో వస్తున్న వ్యక్తి మంచితనంతో పాటు మొండితనం కలగలిపినవాడని ఆయన తాడోపేడో తేల్చుకునే వ్యక్తని, ఆయనకు ఎలక్షన్లయినా, కలెక్షన్లయినా రికార్డులు బద్దలు కొట్టడమే తెలుసని చెప్పుకొచ్చాడు. అలాగే సినీ రంగంలో ఉన్నవారు రాజకీయాల్లో ఒకరి వైపు ఉంటే అవకాశాలు రావని అంటారు. పవన్‌కళ్యాణ్‌కు సపోర్ట్ చేసినందుకు నాకు అవకాశాలు రాపోతే వెళ్లి ఉద్యోగం చేసుకుంటానని చెప్పుకొచ్చాడు. అంటే ఒకరకంగా సినిమాలు లేకపోయినా పర్లేదు పవన్ వెంటే నేను అంటున్న ఆదికి నిజంగానే జనసేనానికి మద్దతు ఇవ్వాలి అనిపించిందా లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అని పలువురు చర్చించుకుంటున్నారు.

More Related Stories