English   

ఎన్టీఆర్ కథానాయకుడు ఫస్ట్ టాక్.. ఎమోషనల్ జర్నీ ఆఫ్ ఎన్టీఆర్

Balakrishna's NTR Kathanayakudu Movie First Review Talk Released
2019-01-09 08:30:43

ఎన్టీఆర్ ఫస్ట్ టాక్ వచ్చేసింది. ఎన్నో రోజులుగా నందమూరి అభిమానులు వేచి చూస్తున్నా రోజు ఇప్పుడు వచ్చేసింది. కథానాయకుడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రానికి ఓవర్సీస్ నుంచి మంచి టాక్ వచ్చింది. ఎలాంటి వివాదాలు లేని తొలి భాగాన్ని ఎలాంటి హంగులు ఆర్భాటాలకు పోకుండా క్రిష్ ఉన్నదున్నట్లు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. హానెస్ట్ అటెంప్ట్ అంటూ ప్రేక్షకులు కూడా మెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా ఓవర్సీస్ నుంచి చాలా మంచి టాక్ సొంతం చేసుకుంది కథానాయకుడు. కొన్ని సీన్లు ఎమోషనల్ గా అద్భుతంగా ఉన్నాయని కన్నీరు పెట్టించే విధంగా క్రిష్ వాటిని తెరకెక్కించాడు అంటున్నారు. మద్రాస్ లో బసవతారకం క్యాన్సర్ ట్రీట్మెంట్ తో సినిమా మొదలవుతుంది. ఆ తర్వాత ఆయన జీవితంలోకి కథ వెళ్తుంది. ఉద్యోగం మానేసి మద్రాసుకు వచ్చి సినిమాలు ప్రయత్నించడం.. అక్కడినుంచి సినిమా అవకాశాలు రావడం.. ఈ సన్నివేశాల చుట్టూనే ఫస్టాఫ్ అంతా అల్లుకున్నాడు క్రిష్. ఇంటర్వెల్ బ్యాంగ్ ఎమోషనల్గా సాగుతుందని తెలుస్తోంది. సెకండ్ హాఫ్ పూర్తిగా ఎన్టీఆర్ సూపర్ హిట్ సినిమాల మీద వెళ్లిపోయింది. ఎన్నో అద్భుతమైన పాత్రలు బాలకృష్ణ వేసి అభిమానులను మెప్పించే ప్రయత్నం చేశారని చెబుతున్నారు. ప్రేక్షకులు తన వంతు వరకు ఎన్టీఆర్ పాత్రలో ఒదిగిపోయాడు బాలకృష్ణ. తనకు ఇచ్చిన బాధ్యతను పూర్తిగా నిర్వర్తించాడు క్రిష్. అభిమానులకు కథానాయకుడు కన్నుల పండుగగా మారితే మామూలు ప్రేక్షకులు కూడా ఒక మహానుభావుడు జీవితాన్ని చూసిన మంచి భావన కలుగుతుందని ప్రచారం జరుగుతుంది. 1982 తెలుగు దేశం పార్టీ ప్రకటనతో సినిమా ముగుస్తుంది.

 

More Related Stories